
విశాఖలో మరోసారి గ్యాస్ లీక్.
విశాఖపట్నం మే 7
విశాఖ ఎల్జీ కంపెనీ నుంచి మరోసారి గ్యాస్ లీక్ అయింది. దీనితో పరిసరాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని అధికారులకు సూచించారు. ఇక ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు ప్రాణాల కోసం పరుగులు పెట్టారు. కాగా, ప్రస్తుతానికి గ్యాస్ లీక్ ఆగిపోయిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించిన కాసేపటికే గ్యాస్ మరోసారి లీక్ కావడంతో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇప్పటికే స్టెరీన్ విష వాయువుతో.. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేలాది మూగ జీవాలు కూడా మృత్యువాతపడ్డాయి. కాగా స్టెరీన్ ప్రభావం దీర్ఘకాలికంగా పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.