YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం దేశీయం

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
హైద్రాబాద్, మే 18,
 లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ లో సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. గత 54 రోజుల్లో గ్రేటర్ లోని 3 కమిషనరేట్లలో 562 కేసులు ఫైల్ అయ్యాయి. సైబర్ క్రిమినల్స్ మొత్తం రూ.5.01 కోట్లు కాజేశారు. 3 కమిషనరేట్ల సైబర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌క్రైమ్ పోలీసులకు డైలీ 20–35 కంప్లయింట్స్ అందుతున్నాయి. వాటిల్లో 25 శాతం ఓఎల్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌ చీటింగ్, 35 శాతం ఓటీపీ ఫ్రాడ్, 20 శాతం కేవైసీ అప్డేట్‌‌‌‌‌‌‌‌, 25 శాతం ఇతర క్రైమ్స్ ఉన్నాయి.ఈ ఏడాది ప్రారంభం నుంచి మే 15 వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 883 కేసులు నమోదవగా, సైబర్ గ్యాంగ్స్ రూ.8 కోట్లు కొట్టేశాయి. అందులో లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ అయిన మార్చి 23 నుంచి ఇప్పటివరకు 412 కేసులున్నాయి. రూ.3 కోట్ల 2 లక్షలు సైబర్ క్రిమినల్స్ అకౌంట్స్ కు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. ఈ నెలలోనే 105 సైబర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌నేరాలు జరగ్గా.. బాధితులు రూ.70 లక్షలు కోల్పోయారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 90 కేసులు నమోదవగా, రూ.కోటి 65 లక్షలను సైబర్‌‌‌‌‌‌‌‌ క్రిమినల్స్ కొట్టేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 60 కేసులు ఫైల్ అయ్యాయి. బాధితులు రూ.16 లక్షలు కోల్పోయారు.ఓల్డ్ సిటీకి చెందిన ఆంకాలజిస్ట్, బంజారాహిల్స్ లోని ఓ హాస్పిటల్ కి చెందిన డాక్టర్, మరో ఇద్దరు రిటైల్ వ్యాపారులను సైబర్ క్రిమినల్స్ మాస్క్ ల పేరుతో ట్రాప్ చేసి రూ.8 లక్షలు కొట్టేశారు.లాక్‌‌డౌన్‌‌లో లిక్కర్‌‌‌‌ డోర్‌‌‌‌ డెలివరీ చేస్తామంటూ ముగ్గురి నుంచి రూ. లక్షా 45 వేలు కాజేశారు.స్నాప్‌‌ డీల్‌‌లో బియర్డ్ ఆయిల్ ఆర్డర్ చేసిన యువకుడి అకౌంట్ నుంచి రూ.86వేలు డ్రా చేశారు.మొబైల్ రీచార్జ్‌‌ కోసం గూగుల్ లో సెర్చ్‌‌ చేసిన నలుగురి డెబిట్ కార్డ్ డీటెయిల్స్‌‌ తీసుకుని రూ.2లక్షల42 వేలు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు.

Related Posts