YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

చెక్ పోస్టుల వద్ద నిఘా

చెక్ పోస్టుల వద్ద నిఘా

చెక్ పోస్టుల వద్ద నిఘా
అదిలాబాద్, మే 18,
లాక్‌డౌన్‌తో ఇతర రాష్ర్టాల్లో ఉన్నవారు మహారాష్ట్ర సరిహద్దుల నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తుండడంతో అధికారులు చెక్‌పోస్టుల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలోని సరిహద్దు గుండా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆ రాష్ట్రం నుంచి వచ్చేవారికి పరీక్షలు చేసి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల నుంచి మహారాష్ట్ర, ఇతర ఉత్తరాది రాష్ర్టాలకు వెళ్లే వారికి సైతం పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో జైనథ్‌ మండలం డొల్లారతోపాటు ఘన్‌పూర్‌ వద్ద అధికారులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక్కడ వైద్య, రెవెన్యూ, పోలీసు అధికారులు షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులతోపాటు ఇతరులు సొంత గ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో నిఘాను మరింత పటిష్టం చేశారు. కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయా అనే వివరాలు తెలుసుకోవడంతో పాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. మన రాష్ర్టానికి చెందిన వారికి చేతిపై 14 రోజుల క్వారంటైన్‌ ముద్ర వేస్తున్నారు. వారి వివరాలను ఆయా జిల్లాల వైద్యాధికారులకు ఆన్‌లైన్‌లో పంపిస్తున్నారు. వీటి ఆధారంగా ఆ జిల్లాల వైద్య సిబ్బంది వీరిని పర్యవేక్షిస్తారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వారి నుంచి సైతం సమాచారం సేకరిస్తున్నారు. మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన వారు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలకు జిల్లా మీదుగా వెళ్తున్నారు. వీరికి సైతం థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి, ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారనే వివరాలను నమోదు చేస్తున్నారు. కలెక్టర్‌ శ్రీదేవసేన, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, పోలీసు అధికారులు చెక్‌పోస్టులను పరిశీలించి అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు

Related Posts