YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా ఆంధ్ర ప్రదేశ్

శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్..నిజమా

శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్..నిజమా

శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్..నిజమా
హైద్రాబాద్, మే 19,
శ్రీరెడ్డి భర్త ఎవరో తెలుసా?? అతను ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు?? శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్ చేసేసుకుంది?? మెడలో ఆ తాళి బొట్టు, నుదిటిన కుంకుమ సీక్రెట్ ఇదే అంటూ ఆమె మెడలో కనిపించిన పసుపుకొమ్ముకు, నుదిటిన కుంకుమ బొట్టు చుట్టూ చాలా కథలు అల్లేస్తున్నారు.సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోలు పోస్ట్ చేసే శ్రీరెడ్డి తాజాగా మెడలో తాళిబొట్టు, నుదుటిన బొట్టు పెట్టుకుని వీడియో వదిలింది. పెళ్లి కాలేదురా బాబూ.. జస్ట్ వీడియో కోసం పెట్టా అని శ్రీరెడ్డి వీడియో వదిలినా.. శ్రీరెడ్డి పెళ్లైపోయిందహో.. తమిళనాడులో ఉంటున్న ఆమె ఓ యువడైరెక్టర్‌ని పెళ్లాడేసిందని అది కూడా సీక్రెట్ మ్యారేజ్ అంటూ రకరకాల వార్తలు వండేశారు. వీటిపై శ్రీరెడ్డి.. ‘దేవుడా నాకు పెళ్లి కాలేదు.. జస్ట్ ఫర్ యాక్టింగ్ పర్ పస్’ అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే శ్రీరెడ్డి చెప్పినట్టు ఆ వీడియోలోని తాళిబొట్టు, నుదుటిన బొట్టు యాక్టింగ్ కోసమే అయినప్పటికీ రియల్ లైఫ్‌లో పెళ్లైందని ఆమె తల్లి గతంలో మీడియా ముందే బయటపెట్టారు. శ్రీరెడ్డి లీక్స్‌తో టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి.. క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూలో అర్థనగ్న ప్రదర్శనతో హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఈ ఇష్యూపై అప్పట్లో శ్రీరెడ్డి తల్లి స్పందించి ఆవేదన వ్యక్తం చేస్తూ శ్రీరెడ్డికి ముందే పెళ్లైనట్టు తెలిపారు.శ్రీరెడ్డి తల్లి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ‘ఏ తల్లీ తన బిడ్డను ఇలాంటి పరిస్థితుల్లో చూడాలని కోరుకోరు. ఏ తల్లి తన కూతురు గురించి వినకూడని మాటలు.. చూడకూడనవి నేను చూశా. శ్రీరెడ్డి సొంత ఊరు విజయవాడలోని కంకిపాడు. ఆమె చిన్నప్పటి నుండి చాలా మొండిగా ఉండేది. తాను అనుకున్నదే జరగాలని భావించే స్వభావం అందుకే పలు సందర్భాల్లో కుటుంబంతో గొడవలు పడేది. ఆమె మొదట్లో బ్యూటీ పార్లర్ నిర్వహించేదని.. ఆ సందర్భంలో వివాహం అయ్యిందన్నారు. మొదట్లో వాళ్ల కాపురం సవ్యంగానే సాగినా తరువాత మనస్పర్ధల కారణంగా విడిపోయిందని ఆ తరువాత హైదరాబాద్‌లో ఓ టీవీ ఛానల్‌లో ఉద్యోగం కోసం వెళ్లిందంటూ’ చెప్పుకొచ్చారు శ్రీరెడ్డి తల్లి. ఆ తరువాత శ్రీరెడ్డి సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఆ తరువాత ఏమైంది అన్నది తెలిసిందే.

Related Posts