YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
ఖమ్మం,మే 20
నందమూరి  తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) జన్మదిన వేడుకలు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత నాయకులు నల్లమల రంజిత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ముఖ్యఅతిధిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం ఖమ్మం నగరంలోని వవివిధహోటల్ లో పనిచేస్తున్న 250 వంట మేస్త్రిలకు 5 కేజీల బియ్యం, కూరగాయలు ,నిత్యావసర సరుకులు కూరపాటి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా కూరపాటి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి మనమడు జూనియర్ ఎన్టీఆర్ వేడుకల సందర్భంగా లాక్ డౌన్ అమలు నేపద్యంలో వంట మేస్త్రి లకు సరుకులు అందించడం అభినందనీయమన్నారు. ఎన్టీఆర్ మరెన్నో విజయాలు సాధించాలని, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు ప్రధాన కార్యదర్శులు గుత్తాసీతయ్య,కేతినేనిహరీష్, ఉపాధ్యక్షులు కొండబాల కర్ణాకర్,ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగార్జునపు శీను, నాయకులు కృష్ణ ప్రసాద్, మోహన్ నాగేశ్వరరావు ,కన్నేటి పృద్వి, సుబ్బారావు ,నాగ దాసరి, సాయి తేజ, శంకర్, రవి, సాయి తదితరులు పాల్గొన్నారు

Related Posts