
మే 22 కార్మిక సంఘాల నిరాసన విజయవంతం చేయాలి
ఏఐటియూసి రాష్ర్టకార్యదర్శి యస్ విలాస్
ఆదిలాబాద్ మే 20
జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు బుధవారం స్థానిక సీపీఐ కార్యక్రమంలో సన్నక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇఫ్టు నాయకులు,పాల్గొన్నారు. సమావేశం లో ఇఫ్టు ఈ నెల 22 న జాతీయ కార్మిక సంఘాల పిల్పు మేరకు జాతీయ నిరసన దినం పాటించాలని, కరోనా మహమ్మారి సందర్భంగా నియమాలు పాటిస్తూ సీపీఐ కార్యాలయం ముందు జరుగుతుందని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశం లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిస్సిగ్గుగా పునుకుంటున్నదని,కార్మికులను బానిసలుగా చేసే చట్టాలను అమలు చేస్తున్న దని విమర్శించారు. వలస కార్మికులను ఆడుకోవడం లో విఫలం చెందారని అన్నారు. 10 డిమాండ్స్ తో మే 22 న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశం లో కామ్రేడ్.ఎస్.విలాస్,ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి,ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు,సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ రాజేందర్, ఇఫ్తు జిల్లా కార్యదర్శి వెంకట నారాయణ,సీఐటీయూ జిల్లా ఉపధ్యక్షుడు బి.సురేందర్, ఇఫ్టూ జిల్లా అధ్యక్షులు జగన్ సింగ్ లు పాల్గొన్నారు.