YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

భారత్ గ్యాస్ ఏజెన్సీస్ పై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కు వినతి

భారత్ గ్యాస్ ఏజెన్సీస్ పై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కు వినతి

భారత్ గ్యాస్ ఏజెన్సీస్ పై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కు వినతి
గోనెగండ్ల మే 20
గోనెగండ్ల లోని భారత్ గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు   రామకృష్ణ, నాగరాజు,శరత్ లు మాట్లాడుతూ అక్రమాలకు అడ్డుగా నిలిచిన టువంటి భారత్ గ్యాస్ ఏజెన్సీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, సామాన్యులైనటువంటి వినియోగదారులపై విపరీతమైన ధరలు వేసి, అదేవిధంగా కనీసం లైసెన్సులు లేని వ్యక్తులను డ్రైవర్లుగా ఉంచుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం చాలా దారుణమని అన్నారు. సోమవారం కైరవాడి గ్రామంలో ఐదు సంవత్సరాల బాలుడు పై గ్యాస్ ఏజెన్సీ వాహనం పారడం జరిగిందని, ఆ పిల్లవాడి పరిస్థితి చాలా విషమంగా ఉందని దానికి బాధ్యులు అయినటువంటి భారత్ గ్యాస్ ఏజెన్సీ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆ బాలుడు కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఇలాంటి ప్రమాదాలు మండలంలో చాలా జరిగాయని అయినా అధికారులు చర్యలు తీలుకోలేదని మండిపడ్డారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు  పునరావృతం కాకూడదని దానికి కారణం  బాధ్యులపై చర్యలు తీసుకుని, అర్హులైన వారిని భారత్ గ్యాస్ ఏజెన్సీలో నియమించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు.

Related Posts