YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం విదేశీయం

రష్యాలో హాట్ నర్సు

రష్యాలో హాట్ నర్సు

రష్యాలో హాట్ నర్సు
మాస్కో, మే 21
రోనా వంటి ప్రమాదకర వైరస్‌తో తమ ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్న వైద్య సిబ్బంది సేవలను ఎప్పటికీ మరిచిపోలేం. వారిని గౌరవించడం మన బాధ్యత. కానీ, ఈ నర్సు గురించి చెప్పాలంటే.. తప్పకుండా ‘హాట్‌నెస్’ గురించి ప్రస్తావించాలి. ఆ నర్సు వస్త్రధారణ ‘హాట్’గానే ఉండవచ్చు. కానీ, దాని వెనుక ఉన్న కారణం గురించి తెలిస్తే ‘అయ్యో పాపం’ అనుకుంటారు.రష్యాలోని తులా ప్రాంతంలోని రీజనల్ క్లినికల్ హాస్పిటల్‌లో ఈ నర్సు పనిచేస్తోంది. కోవిడ్-19 పురుషుల వార్డులో ఆమె సేవలందిస్తున్న ఆమె ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు కారణం.. ఆమె ధరించిన పారదర్శక పీపీఈ సూట్. ఆమె లోదుస్తులపైనే పీపీఈ సూట్ ధరించడం వల్ల లోపలవన్నీ బయటకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో కొందరు ఫొటోలు తీసి ఈ నర్సు చాలా ‘హాట్’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే, హాస్పిటల్ యాజమాన్యం దీన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తప్పు ఆమెది కాదని, ఆమె ధరించిన పీపీఈ సూట్‌‌దేనని పేర్కొన్నారు.అయితే, రీజనల్ హెల్త్ మినిస్టరీ మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఆమె డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిందని, దీనిపై వివరణ ఇవ్వాలని హాస్పిటల్ నిర్వాహకులను ఆదేశించింది. ఇందుకు ఆ నర్సు చిత్రమైన సమాధానం చెప్పింది. పీపీఈ సూట్లు ధరిస్తుంటే చాలా వేడిగా ఉంటోందని తెలిపింది. వేడిని తట్టుకోలేక లోదుస్తుల పైనే పీపీఈ సూట్ ధరిస్తున్నానని తెలిపింది. హాస్పిటల్ తనకు ఇచ్చిన పీపీఈ సూట్స్ పారదర్శకంగా ఉండటం వల్ల తన లోదుస్తులు బయటకు కనిపిస్తున్నాయని, ఇందులో తన తప్పు ఏముందని ప్రశ్నించింది. పైగా తాను ధరించినవి లోదుస్తులు కాదని, టూ పీస్ బికినీ అని పేర్కొంది.ఆమె సమాధానానికి ఉన్నతాధికారులు సంతృప్తి పడలేదు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే, ఆమెకు ఏ శిక్ష విధించిందనే సంగతి తెలియరాలేదు. ఈ ఘటనపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యను ఆమె అలా తెలిపిందని అంటున్నారు. పీపీఈ సూట్స్ ధరించే వైద్య సిబ్బంది వేడికి గురికాకూడదంటే.. ఏసీ మెయింటెనెన్స్ బాగుండాలని అంటున్నారు. అలాగే నాణ్యమైన పీపీఈ కిట్లు ఇస్తు ఇలాంటి సమస్యలు ఉండవంటున్నారు. కొందరైతే.. ఆమె అలా డ్రెస్ చేసుకుంటే రోగులు త్వరగా కోలుకుంటారని సెటైర్లు పేలుస్తున్నారు. ఏది ఏమైనా ఆమె ‘హాట్’ ప్రాబ్లం.. మనకు ‘హాట్’గానే కనిపించవచ్చు. కానీ, అది అధికారులు హీటయ్యేంత వరకు వెళ్లి.. ఆమె ఉద్యోగానికే నిప్పు పెట్టింది

Related Posts