YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

ప్రియురాలిని అనుభవించి..హత్య

ప్రియురాలిని అనుభవించి..హత్య

ప్రియురాలిని అనుభవించి..హత్య
చెన్నై, మే 22
వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాత్కాలిక సుఖం కోసం కట్టుకున్న కట్టుకున్న వాళ్లను, ప్రేమించే వాళ్లను చంపేందుకు వెనుకాడటం లేదు. ఇలాగే భర్త కళ్లుగప్పి ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడుతో వెలుగుచూసింది. భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో పారిపోవాలని ఆమె ప్లాన్ వేసింది. ఈలోగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ప్రియుడిని కలుసుకునే అవకాశం రాక విరహంతో విలవిల్లాడింది. ఇంటికి వచ్చి తన తాపాన్ని చల్లార్చాలని ప్రియుడిని రోజూ ఫోన్ చేసి వేధించేది. ఓ రోజు భర్త బయటకు వెళ్లడంతో ప్రియుడికి ఫోన్ చేసి రావాలంటూ వేధించింది. ఆమె టార్చర్‌ను తట్టుకోలేకపోయిన యువకుడు భర్త లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి రాసలీలలు సాగించాడు. అనంతరం ఆమెకు విష మాత్రలు ఇచ్చి ప్రాణం తీశాడు. చివరికి పోలీసుల ఎంట్రీతో అతడి బండారం బయటపడింది. దీంతో ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు.తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా ముత్తుకూరు కొడుముడి ప్రాంతానికి చెందిన యువరాజ్ (37)కు సంగీత(34)తో కొంతకాలం క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. బ్యూటీషియన్ కోర్సు చేసిన సంగీత సొంతంగా బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు అదే ప్రాంతానికి చెందిన వివేక్(25) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. రోజూ సంగీత బ్యూటీపార్లర్‌కు వెళ్లొచ్చే క్రమంలో అతడు తరుచూ మాట్లాడుతూ దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే ఓ వర్షం కురిసిన రాత్రి ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది. భర్త కళ్లుగప్పి సంగీత తరుచూ ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తోంది.ఈ విషయం తెలుసుకున్న యువరాజ్ పద్ధతి మార్చుకోవాలని భార్యకు హితవు పలికాడు. అయినప్పటికీ తీరు మార్చుకోని సంగీత అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉంది. తన భార్య వ్యవహారం బయటకు తెలిస్తే పరువు పోతుందన్న ఆందోళనతో యువరాజ్ మౌనంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయాలని సంగీత నిర్ణయించుకుంది. ‘ నేను భర్త, పిల్లలను వదిలి వచ్చేస్తా. ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లిపోయి పెళ్లిచేసుకుందాం. బ్యూటీపార్లర్ పెట్టుకుని నేనే సంపాదించి నిన్ను పోషిస్తా’ అంటూ సంగీత ప్రియుడిని మభ్యపెట్టింది. అయితే టైమ్‌పాస్ కోసం సంగీతతో అక్రమ సంబంధం కొనసాగించిన వివేక్.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేశాడు.తన కంటే వయసుతో పెద్దది కావడం, పైగా ఇద్దరు పిల్లల తల్లిని తాను పెళ్లి చేసుకోవడమేంటని అతడు తనలో తానే ప్రశ్నించుకున్నాడు. కానీ సంగీత మాత్రం కొద్ది నెలలుగా తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తూనే ఉంది. ఈలోగా లాక్‌డౌన్ మొదలు కావడంతో సంగీత బ్యూటీపార్లర్ మూతపడింది. ప్రియుడిని చూడలేక, అతడితో ఎంజాయ్ చేయడం కుదరక ఆమె తహతహలాడిపోయింది. దీంతో వివేక్‌కు ఫోన్ చేసి తన కోరికలు తీర్చాలని వేధించేది. నీ భర్త ఇంట్లో ఉండగా ఎలా కుదురుతుందని అతడు నిలదీసినా పట్టించుకునేది కాదు. బుధవారం యువరాజ్ పని మీద బయటకు వెళ్లడంతో సంగీతకు ఛాన్స్ దొరికింది. వెంటనే వివేక్‌కు ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది.ఇద్దరూ ఏకాంతంగా గడిపిన తర్వాత తనను ఎక్కడికైనా తీసుకుపోవాలని సంగీత ఒత్తిడి తెచ్చింది. కానీ ఆమెతో వెళ్లడం ఇష్టం లేని వివేక్.. పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న విషపు మాత్రలు కూల్‌డ్రింక్‌లో కలిపి ఆమెతో తాగించాడు. అనంతరం గొంతు నులిమి చంపేసి పరారయ్యాడు. కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన యువరాజ్ భార్య మంచంపై విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి షాకయ్యాడు. సంగీత చనిపోయిందని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అక్రమ సంబంధం కోణం వెలుగులోకి రావడంతో పోలీసులు వివేక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Posts

0 comments on "ప్రియురాలిని అనుభవించి..హత్య"

Leave A Comment