YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

25 నుంచి లడ్డూ ప్రసాదాలు

25 నుంచి లడ్డూ ప్రసాదాలు

25 నుంచి లడ్డూ ప్రసాదాలు
విజయవాడ, మే 23
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా స్వామివారి లడ్డూ ప్రసాదం అందుబాటులోకి రానుంది. 13 జిల్లా కేంద్రాల్లో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాల్లో లడ్డూలు విక్రయిస్తారు. లడ్డూ ప్రసాదానికి సంబంధించిన సమాచారం కోసం టీటీడీ కాల్‌ సెంటర్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు 18004254141 లేదా 1800425333333ను సంప్రదించవచ్చు. లడ్డూల లభ్యతను బట్టి తిరుపతిలోని టీటీడీ లడ్డూ కౌంటర్‌ నుంచి.. సంబంధిత జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కళ్యాణ మండపాల నుంచి లడ్డూలను అందజేస్తారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చిన అనంతరం లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతారు. లాక్‌డౌన్‌ ముగిసి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించేంత వరకు సగం ధరకే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిన్న లడ్డూ ధరను రూ.50 నుంచి రూ.25కు తగ్గించారు.టీటీడీ సమాచార కేంద్రాలు, కళ్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు జరుగుతాయి. ప్రత్యేక ఆర్డర్‌పై స్వామివారి లడ్డూలు పంపిణీ చేయనున్నారు.. పెద్దమొత్తంలో లడ్డూ ప్రసాదం కావాలనుకునేవారు ప్రత్యేక ఆర్డర్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ - 98495 75952, ఆలయ పేష్కార్‌ శ్రీనివాస్‌ - 9701092777ను సంప్రదించవచ్చని టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు. తమిళనాడు, కర్ణాటకలో కూడా లడ్డూ ప్రసాదం విక్రయిస్తారు.

Related Posts