క్రీడలకు పెద్దపీట వేస్తూ పాలసీ
హైదరాబాద్ మే 26
రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తొలిసారిగా స్పోర్ట్స్ పాలసి పై బుధవారం సబ్ కమిటీ భేటీ అవుతుందన్నారు. ఈ స్పోర్ట్స్ పాలసీ పై ఏర్పాటు అయిన క్యాబినెట్ సబ్ కమిటీ లో రాష్ట్ర పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు , రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తో కూడిన మంత్రుల బృందం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పన, క్రీడాకారులకు ప్రోత్సాహకాల తో పాటు దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని తీసుకువస్తామన్నారు. అందుకు అవసరమైన సలహాలు, సూచనలను రాష్ట్రంలో ఉన్న సీనియర్ క్రీడాకారులు, కోచ్ లను, స్పోర్ట్స్ జర్నలిస్టులను, క్రీడా సంఘాలను, క్రీడా అవార్డు గ్రహీతల ద్వారా తీసుకుని, ఇతర రాష్ట్రాల, దేశాల క్రీడా పాలసీలను సైతం అధ్యయనం చేసి మెరుగైన క్రీడా పాలసీ ని ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్పిస్తామన్నారు.
క్రీడాకారులకు గొప్ప అవకాశం గా ఈ స్పోర్ట్స్ పాలసి తయారు చేస్తామన్నారు. దేశంలో క్రీడా రంగంలో నెంబర్ వన్ రాష్ట్రం గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సారధ్యంలో దేశంలో మిగితా రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. అలాగే క్రీడల్లో కూడ రోల్ మోడల్ స్టేట్ గా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సారధ్యంలో రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ దేశంలోనే అత్యుత్తమ పాలసీ గా ఇప్పటికే గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఎంతో మంది పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు ముందుకు వస్తున్నారన్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచంలో చాలా దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు సాగు మన దేశం వైపు చూస్తున్నారన్నారు. మన దేశంలో పరిశ్రమల స్థాపనకు అనువైన రాష్ట్రం మన తెలంగాణ అని, ప్రతిఒక్క పారిశ్రామికవేత్త తెలంగాణ వైపు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ని చూపుతున్నారన్నారు. తెలంగాణ లో బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి వేల కోట్ల విలువైన భూములను కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు. సంక్షేమం పథకాల అమలు లో దేశంలోనే మొదటి స్థానం లో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు మంత్రి.