YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గంజాయి చాక్లెట్స్...!!!

గంజాయి చాక్లెట్స్...!!!

హైద్రాబాద్ ధూల్‌పేటలో గంజాయి గుప్పుమంటోంది. గుడుంబా అమ్మకాలు నిలిచిపోయాయనుకుంటే గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా సాగుతున్నట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడుల్లో తేటతెల్లమవుతోంది. నగరం... గుడుంబా మహమ్మారి నుంచి విముక్తి పొందడంతో కొంత ఊపిరి పీల్చుకున్న హైదరాబాద్ జిల్లా ఆబ్కారీ అధికారులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. గుడుంబా వ్యాపారంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంతో దాన్ని వదిలేసి ధూల్‌పేట వాసులు గంజాయి వ్యాపారం మొదలు పెట్టినట్టు తెలుస్తోందిగుడుంబా తయారీ, విక్రయాలకు ప్రధాన స్థావరమైన ధూల్‌పేట గుడుంబా ఫ్రీ ప్రాంతంగా మారినప్పటికీ... కొంత మంది వ్యాపారులు మత్తు దారులు తొక్కుతుండడంతో ఆబ్కారీ అధికారు లు తలలు పట్టుకుంటున్నారు. గంజాయి వనంగా మారుతున్న ధూల్‌పేటపై గతంలో కంటే ఎక్కువ నిఘా పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో ఆబ్కారీ బృందా లు నిరంతరం దాడులు కొనసాగిస్తూ అడపా దడపా గం జాయిని పట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే శనివారం దాడులు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 78 మత్తు చాక్లెట్లు, 3.650కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ నంద్యాల అంజిరెడ్డి కథనం ప్రకారం....లోయర్‌ధూల్‌పేట, టక్కర్‌వాడికి చెందిన బ్రిజ్‌రాజ్ సింగ్ గంజాయి స్మగ్లర్. గంజాయితో తయారు చేసిన చాక్లెట్లను బీహార్ నుంచి తీసుకువచ్చి ధూల్‌పేటలోని తన మేనల్లుడైన లాల్‌బహదూర్‌సింగ్ ద్వారా స్థానికులకు విక్రయిస్తున్నాడు. గంజాయి పౌడర్‌ను తీపి పదార్థంతో కలిపి తయారు చేసే చాక్లెట్లకు టైగర్ ఆయుర్వేద చాక్లెట్స్‌గా లేబులింగ్‌తో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. దీంతో అవి మత్తు చాక్లెట్లనే అనుమానం ఎవరికీ రావడంలేదు. కేవలం విక్రయించేవారు, కొనేవారికి మాత్రమే వాటి నిజరూపం గురించి తెలుస్తు న్నది. ఈ చాక్లెట్లను స్థానికులతో పాటు కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు, యువతీ, యువకులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. వీటిని నోట్లో వేసుకుని చప్పరిస్తే మత్తులో మునిగిపోతారు. హార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైజాగ్‌, తెలంగాణలో ఖమ్మం, కరీంనగర్‌ తదితర ప్రాంతాల నుంచి గంజాయి ధూల్‌పేటకు సరఫరా అవుతున్నట్టు అధికారుల విచారణలో తేలింది. మహిళలను అడ్డంపెట్టుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. బుధవారం ఒక్కరోజే 15 కిలోల గంజాయిని ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ధూల్‌పేట నుంచి ఉప్పల్‌, రామంతాపూర్‌, బేగంబజార్‌, జుమ్మేరాత్‌ బజార్‌తోపాటు నగరంలోని పలువురికి సరఫరా అవుతోంది. కిలోల రూపంలో కొనుగోలు చేసి 10, 25, 50, 100 గ్రాముల పొడిని ప్యాకెట్లుగా చేసి రూ.50 నుంచి రూ.500 విక్రయిస్తున్నారు.

Related Posts