YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆదాయ మార్గాలపై ఆర్టీసీ దృష్టి

ఆదాయ మార్గాలపై ఆర్టీసీ దృష్టి

ఎన్ని అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నా మహబూబాబాద్‌లో ఆర్టీసీ ఆదాయం తక్కువగానే ఉంది. దీంతో ఆదాయం పెంచుకోవడమే కాక లాభాలూ కైవసం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటుకానున్నాయి. ఈ కమిటీల్లో కలెక్టర్ ఛైర్మన్ గా ఉంటారు. ఇంకా అనేకమంది ఉన్నతాధికారులకూ భాగం ఉంటుంది. ప్రతీనెలా సమావేశమయ్యే ఈ కమిటీ ఆర్టీసీ అభివృద్ధి పథంలో నిలిచేలా విధానాలు రూపొందించడంతో పాటూ చర్యలు తీసుకుంటుంది. వాస్తవానికి అనుమతుల్లోని ప్రైవేట్ వాహనాలను నిలువరించి, ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్యను పెంచడమే ఈ కమిటీ ఏర్పాటులో ప్రధాన ఉద్దేశం. ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లాల్లో మొత్తంగా 9 బస్ డిపోలు ఉన్నాయి. ఇవన్నీ నష్టాల్లో సాగుతున్నాయని అంచనా. 2017లో వజ్ర బస్సులను అందుబాటులోకి తెచ్చినా ఫలితం లేదు. టికెట్ ధర తగ్గించినా ఆదరణ దక్కడంలేదు. దీంతో దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులు పట్టుమీద ఉన్నారు. 

స్థానికంగా ఆర్టీసీకి ఆదరణ దక్కకపోవడానికి ప్రైవేట్ వాహనాలే కారణంగా అధికారులు గుర్తించారు. ప్రధానంగా అనుమతి లేకుండా తిరుగుతున్న ప్రైవేట్ వాహనాల వల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లుతోంది. దీంతో వీటికి చెక్ పెట్టేందుకు కమిటీలు ఏర్పాటు చేశారు. వరంగల్‌ రీజియన్‌లో కొన్నేళ్లుగా చేపట్టిన సంస్కరణలతో పరిస్థితి కొంత మెరుగుపడింది.  నష్టాలూ తగ్గాయి. మేడారం జాతర సాగినప్పుడు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నష్టాలను గణనీయంగా తగ్గించుకోగలిగారు. ఈ తరహా చర్యలు మరిన్ని తీసుకోవాల్సి ఉంది. ఇక జిల్లాల వారీగా త్వరలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి అనుమతిలేని వాహనాలను తగ్గించే కార్యక్రమాన్ని జోరందుకోనుంది. ఎక్కడెక్కడ ఆ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎంత మంది ప్రయాణికులు వాటిపై ఆధారపడుతున్నారు. అలాంటి ప్రాంతాల్లో ఆర్టీసీ సేవలు ఎలా మెరుగుపరచాలనే విషయాలపై కసరత్తు చేస్తారు. ఈ అంశాలపై నెలవారీగా జరిగే సమావేశాల్లో రవాణా అధికారి కమిటీకి వివరిస్తారు. అనంతరం సభ్యులు పరిశీలించి వాటి నివారణకు చర్యలు తీసుకుంటారు. ఈ చర్యలతోనైనా ఆర్టీసీ స్థితిగతులు మారతాయో లేదో తెలియాలంటే మరికొన్ని వేచి చూడాల్సిందే.

Related Posts