YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆస్తి-పాస్తులు తెలంగాణ

 అడ్డగోలుగా భూ కబ్జాలు 

 అడ్డగోలుగా భూ కబ్జాలు 

 అడ్డగోలుగా భూ కబ్జాలు 
వరంగల్, జూన్18,
వరంగల్‌ నగరంలోని నర్సంపేట రోడ్డుకు ఆనుకుని ఉన్న గోపాలస్వామి ఆలయానికి చెందిన సుమారు 800 గజాల భూమిని ఆలయ నిర్వాహకులు ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయించారు. వాస్తవంగా గోపాలస్వామి గుడికి దేవుని మాన్యం కింద సర్వే నంబర్‌ 381, 388/ఆ, 499, 500, 396, 493, 392/2లో 4.22 ఎకరాల భూమి ఉంది. 1954–55 నుంచి శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం భూమి రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. ఈ సర్వే నంబర్ల పరిధిలో తోట మైదానం, గుడి, డాక్టర్స్‌కాలనీ–1, డాక్టర్స్‌కాలనీ–2లో భూమి మొత్తం ఉంది. అయితే సర్వే నంబర్‌ 392/2లో ఉన్న పంప్‌హౌస్‌ సమీపంలోని లక్ష్మీగార్డెన్స్‌ పక్కన ఎంత భూమి ఉందో దేవాదాయ శాఖ అధికారులకే తెలియాల్సి ఉంది. ఇందులో మిత్రమండలి పేరుతో ఒక ప్రైవేట్‌ స్కూల్‌ నిర్వహిస్తున్నారు. ఈ స్కూ ల్‌ ద్వారా వచ్చే ఆదాయం ఆలయానికి చెం దడం లేదు. వారు అద్దె చెల్లిస్తున్నారా... ఎంత చెల్లిస్తున్నారు.. అన్న విషయాలు మాత్రం ఆల య కమిటీ,  శాఖ అధికారులకే తెలుస్తోంది ఆలయానికి ఆనుకుని గోపాలస్వామి గుడి స్కూల్‌ పేరుతో ఎయిడెడ్‌ పాఠశాలను ప్రారంభించారు. 1965లో అప్పటి మునిసిపాలిటీ అధికారులు స్కూల్‌కు ఇంటి నంబర్‌ 13– 696ను కేటాయించారు. అదే పేరుతో రికార్డుల్లో నమోదైంది. అయితే ఏమాయ జరిగిందో తెలియదుకానీ.. 1975లో గోపాలస్వామి టెంపుల్‌ స్కూల్‌ పేరు కాస్తా ఇదే నంబర్‌తో శేషాచారిగా మునిసిపల్‌ రికార్డుల్లోకి మారింది. విషయం తెలియడంతో 1984లో ఈ పాఠశాల ప్రభుత్వ ప్రైమరీ ఎయిడెడ్‌ స్కూల్‌గా పేరు మారి రికార్డుల్లో నమోదైంది. 1993లో వరంగ ల్‌ మునిసిపాలిటీ కాస్తా మునిసిపల్‌ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ కావడంతో నగరంలో కొత్తగా ఇంటి నంబర్లు కేటాయించారు.ఆలయానికి సంబంధించిన భూమిలో ఉన్న ప్రభు త్వ ప్రైమరీ ఎయిడెడ్‌ స్కూల్‌ నంబర్‌ కాస్తా ఇంటి నంబర్‌ 13–4–157గా మారింది. అప్ప టి నుంచి అదే పేరుతో ఉన్న పాఠశాల పేరు కాస్తా 2016లో మారింది. ప్రభుత్వ పాఠశాల స్థానంలో అరుట్ల శేషాచారి పేరు గ్రేటర్‌ కార్పొరేషన్‌ రికార్డుల్లోకి ఎక్కింది. అప్పటి నుంచి పా ఠశాల భూమిని అమ్మేందుకు పలుసార్లు ప్రయత్నాలు చేసినా కొంత మంది దేవాలయ భూ మిని మీరు ఎట్లా విక్రయిస్తారని అడ్డుకోవడంతో సాధ్యం కాలేదు. దీంతో ఈ స్థలంలో ఉన్న పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులకు ప్రమాదకరంగా మా రింది. వి షయాన్ని గుర్తించిన అధికారులు పాఠశాల ను వేరేచోటికి తరలించారు. తర్వాత భవనం కూ లిపోవడంతో ఎవరు స్థలాన్ని పట్టించుకోలేదు.

Related Posts