YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

మైనర్ కూతుళ్లపై అత్యాచారం.. తండ్రి అరెస్ట్

మైనర్ కూతుళ్లపై అత్యాచారం.. తండ్రి అరెస్ట్

సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు సంవత్సరాల నుంచి తన ఇద్దరు మైనర్ కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడుతున్న తండ్రిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు కూతుళ్ల వయసు ఒకరికి 17,మరొకరికి 13,పెద్దమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఫ్యాషన్ డిజైనర్‌కు17,13 ఏళ్ల కూతుళ్లతో పాటు.. మరో 10ఏళ్ల కూతురు, 3ఏళ్ల కుమారుడు ఉన్నారు.ఒకవేళ తమ తండ్రిని తాము ప్రతిఘటిస్తే కొట్టి బయటకు పంపిస్తామని బెదిరించడమే కాకుండా.. తమ చదువులను కూడా ఆపేస్తానని హెచ్చరించేవాడని బాలికలు తెలిపారు. అంతేకాకుండా తమ చెల్లి, తమ్ముడిని చంపేస్తానని బెదిరించేవాడని వారు పేర్కొన్నారు. ఇదంతా భరించలేని ఆ బాలికలు విషయాన్నంతా తల్లికి వివరించారు. ఆమె ఈ విషయమై భర్తను నిలదీయడంతో ఆ ఇద్దరు బాలికలతో పాటు భార్యను కూడా ధూషించాడు. దీంతో ఆమె తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది.  17ఏళ్ల బాలిక తనను తన తండ్రి హోటల్లో పనిచేయడమే కాకుండా.. వ్యభిచారం చేసి డబ్బు తేవాలంటూ బెదిరించేవాడని తెలిపింది. దీంతో నిందితుడిని ఐపీసీ, పోస్కో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Posts