YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

 జూలై 15 తర్వాతే విదేశాలకు విమానాలు

 జూలై 15 తర్వాతే విదేశాలకు విమానాలు

 జూలై 15 తర్వాతే విదేశాలకు విమానాలు
న్యూఢిల్లీ, జూన్ 27
కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భారత్ నుంచి ఇతర దేశాలకు, విదేశాల నుంచి భారత్‌కు ఎలాంటి విమాన ప్రయాణాలు ఉండబోవని స్పష్టం చేసింది. శుక్రవారం  మధ్యాహ్నం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. రవాణా సర్వీసులు, డీజీసీఏ అనుమతించే ప్రయాణ విమానాలకు ఇది వర్తించదని పేర్కొంది.కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో దేశీయ, విదేశీ విమాన సర్వీసులు నిలిపివేస్తూ విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే.. దేశీయ విమాన సర్వీసులకు పరిమితులతో అనుమతి ఇచ్చినా.. అంతర్జాతీయ సర్వీసులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. త్వరలో అంతర్జాతీయ విమానాలు కూడా ప్రారంభమవుతాయని వార్తలు వెలువడుతున్న వేళ కేంద్రం ఈ ప్రకటన చేసింది. మరోవైపు.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తరలించే ప్రక్రయి కొనసాగుతోంది

Related Posts