YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ

రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ

రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ
నంద్యాల జూన్ 30 
మంగళవారం నాడు నంద్యాలలో భారతి జూనియర్ కళాశాలలో  రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నంద్యాల గౌరవ అధ్యక్షులు వంకిరి  రామచంద్రుడు  ఆధ్వర్యంలో* విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు  వంకిరి రామచంద్రుడు,శ్రీరాములు,చంద్రప్ప,రాజునాయుడు,ఓబులేసు,రియాజ్*  మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి కోసం రాయలసీమకు రావలసిన నిధులు నియామకాలు నీళ్లు న్యాయ రాజధాని మరియు కర్నూలు కేంద్రంగా న్యాయ విశ్వవిద్యాలయం నంద్యాలలో రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం అదేవిధంగా మరిన్ని విద్యాసంస్థల ఏర్పాటు కోసం రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు తెలిపారు, కర్నూలు న్యాయ రాజధాని ప్రకటన చేసినప్పటికీ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు ఓర్వకల్ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి కాలేదని కృష్ణా,తుంగభద్ర,హంద్రీ, నదులు ఉన్న నీటిని ఉపయోగించే పరిస్థితులు లేకపోవడం దారుణమని అన్నారు. రాయలసీమలో 49 మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అందించింది కనుక స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల తో సమావేశం నిర్వహించి రాయలసీమ సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా పయనించాలని వారు కోరారు లేనిపక్షంలో ఆందోళన బాట పడతామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాష్, రామరాజు,వెంకటేష్,కిరణ్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు

Related Posts