YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 అదిలాబాద్ జిల్లా పై సర్కార్ కు సవతి తల్లి ప్రేమ. 

 అదిలాబాద్ జిల్లా పై సర్కార్ కు సవతి తల్లి ప్రేమ. 

 అదిలాబాద్ జిల్లా పై సర్కార్ కు సవతి తల్లి ప్రేమ. 
సీఎం అబద్ధాల కోరు వల్లె టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులకు కరోనా
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంపై పై ప్రభుత్వం నిర్లక్ష్యం
బీజేపీ నేతలతో కలిసి ఎంపీ సోయం బాపురావు సందర్శన
ఆదిలాబాద్  జూన్  30
ఆదిలాబాద్ జిల్లా పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అభివృద్ధి పనుల కు  నిధులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ సోయం బాపురావు అన్నారు.. మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ తో కలిసి ఎంపీ సోయం బాపురావు రిమ్స్ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన భవనాన్ని సందర్శించారు. వెనుకబడిన అదిలాబాద్ జిల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కార్డియాలజీ న్యూరాలజి తో పాటు 9 విభాగాల తో కూడిన ఆధునిక హంగులతో ఆస్పత్రి భవనానికి 150 కోట్లు కేంద్రం మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 30 కోట్లు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని కరోనా పరీక్షలు కూడా చేయకుండా తప్పించుకు తిరుగుతోందని విమర్శించారు.. అబద్దాలు చెప్పే వారికి కరోనా వస్తుందని ముఖ్యమంత్రి శాపం చేశారని తీరా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకు కరోనా వస్తోందని. ముఖ్యమంత్రి అసమర్థత వల్లే కేసులు పెరిగిపోతున్నాయని దుయ్యబట్టారు.. పి ఎన్ ఎస్ ఎస్ వై ప్రాజెక్టు కింద కేంద్రం ఇప్పటికీ 118 .5 కోట్ల నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు.. పలుమార్లు ఈ విషయమై ముఖ్యమంత్రికి తాను లేఖ రాశానని చెప్పారు. రిమ్స్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.. కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకు మాత్రమే ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తున్నారని మిగతా వాటిని విస్మరిస్తున్నారని ఆరోపించారు.. ప్రభుత్వం వెంటనే పి ఎన్ ఎస్ ఎస్ వై ఆస్పత్రి భవనానికి నిధులు మంజూరు చేయకపోతే వెంటనే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.. బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రతి ఏటా జిల్లాలో గిరిజనులు వ్యాధుల బారిన పడి మరణిస్తే కేంద్రం నాలుగేళ్ల కిందట ఆదిలాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం నిధులు మంజూరు చేసిందని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మూడు రూపాయలు కూడా మంజూరు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.. ప్రభుత్వం పేదల వైద్యాన్ని పూర్తిగా విస్మరించిందని రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నాంపల్లి వేణుగోపాల్ కౌన్సిలర్లు ఆకుల ప్రవీణ్ లాలా మున జోగు రవి ఏండ్రాల నగేష్ దినేష్ మటోలియ లోక ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.

Related Posts