
విశాఖపట్నం జూలై 3 ఏటా వైభవంగా జరిగే విశాఖ సింహాచలం గిరిప్రదక్షిణపై కరోనా ఎఫెక్ట్ పడింది.శ్రీ వరహా లక్ష్మి నరసింహాస్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శనివారం అశేష భక్తుల మద్య జరిగే గిరి ప్రదక్షిణ రద్దు చేయడమే కాకుండా ఆషాడ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 5న జరిగే నాల్గో విడత చందన సమర్పణ కార్యక్రమంను కూడా రద్దు చేసినట్టు దేవాలయ అధికారులు ప్రకటించారు.స్వామి వారి గిరి ప్రదక్షిణకు గాని, మొక్కులు చెల్లించుకొనుటకు గాని భక్తులకు అనుమతి లేని కారణంగా ఆలయానికి రావద్దని ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేశారు.అయితే ఇప్పటికే పలు దేవాలయాల్లో ఆలయ సిబ్బందికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఇలాంటి ఆలయాల్లో ఇప్పటికే రద్దు చేయగా, సింహాచలంలో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు రోజులు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.