
ఏలూరు
మాజీ మంత్రి బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా టెస్ట్ లో తనకు పాజిటివ్ గా తేలిందని అయన స్వచ్ఛందంగా ఒక వీడియో విడుదల చేసి ప్రకటించారు. మాణిక్యాలరావు మాట్లాడుతూ
కరోనా సోకితే భయపడవలసిన అవసరం లేదు.. కరోనా సోకకుండా కనీస జాగ్రత్తలు పాటించాలి. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించండి.. వీలైనంత వరకూ ఇతరులతో కారులో ప్రయాణం చేయవద్దని అయన అన్నారు. ఇటీవలే తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ బిజెపి నేతకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనతో మాణిక్యాల రావు కారులో ప్రయాణించారు. దాంతో అయనకుడా పరీక్షలను జరిపించుకున్నారు.