
అమరావతి జూలై 4
తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద కరోనా కలకలం రేపుతోంది. 10 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్‌కు చెందిన 8 మంది సెక్యూరిటీ గార్డులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. మరో బెటాలియన్‌కు చెందిన ఇద్దరు గార్డులు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ నెల 2న సీఎం నివాసం వద్ద గార్డులకు కరోనా టెస్టులు నిర్వహించారు. అయితే టెస్టుల ఫలితాలను ఈ రోజు వెల్లడించారు. ఈ పలితాల్లో పది మంది వైరస్ నిర్ధారణ అయింది. దీంతో సీఎం కార్యాలయం కలకలం మొదలైంది. గతంలో సీఎం నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకింది