YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోన పై స్వయంగా రంగంలోకి దిగి గవర్నర్ ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్

కరోన పై స్వయంగా రంగంలోకి దిగి గవర్నర్       ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబద్ జూలై 7 
తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా పెరిగిపోతోన్న కరోనా కేసుల సంఖ్యను చూసి నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. ఓ వైపు టెస్టుల సంఖ్య పెరుగుతోన్నా...మరింత మంది బాధితులు కరోనా టెస్టుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు గాంధీ ఆసుపత్రికి కరోనా బాధితుల తాకిడి ఎక్కువైందని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ బెడ్లు ఖాళీ లేవని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కరోనా బాధితులకు ప్రభుత్వం సరైన వైద్యం అందించడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కరోనా బాధితులు తమ మొర వినిపించారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. కరోనా ఐసోలేషన్ వార్డులు బెడ్లు ఇతర సౌకర్యాలు ఉన్న ఆస్పత్రుల ప్రతినిధులతో తమిళిసై మాట్లాడారు. ఆయా ఆసుపత్రులలోని సదుపాయాలు వార్డులు బెడ్ల సంఖ్య తదితర వివరాలను తమిళసై అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ చికిత్స పడకలు పరీక్షలు బిల్లులు ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదులపై ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో గవర్నర్ చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు కరోనా సమీక్షకు రావాలంటూ ప్రభుత్వ పెద్దలను పిలిచినా ఎవరూ హాజరుకాలేదని తెలుస్తోంది. దీంతో గవర్నరే స్వయంగా రంగంలోకి దిగి ఆస్పత్రి వర్గాలతో సమీక్ష చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ....కేసీఆర్ మీడియా ముందుకు రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేసేఆర్ ఎక్కడ....అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నల జల్లు కురిపిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో గవర్నర్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related Posts