YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలుగు ప్లే బాయ్... ఆర్జీవీ

తెలుగు ప్లే బాయ్... ఆర్జీవీ

హైద్రాబాద్, జూలై 8, 
రాంగోపాల్ వర్మ ఎప్పుడూ కొత్త హీరోయిన్ల గురించి వెతుకుతుంటాడు. ఒకటి రెండు మూవీస్ మినహా వర్మ కళ్ళు కొత్తందం వైపు చూస్తాయి. జీఎస్టీ,  క్లైమాక్స్ మూవీ మినహా మిగతా అన్ని సినిమాల్లో కొత్త భామలు తమ అందాలతో కనువిందు చేస్తుంటారు. మియా మాల్కోవాతో జీఎస్టీ, క్లైమాక్స్ మూవీ తీశాడు వర్మ. తాజాగా థ్రిల్లర్ పేరుతో మరో సంచలనానికి నాంది పలికాడు రాంగోపాల్ వర్మ. గతంలో కంటే కూడా ఆయన పబ్లిసిటీ డోస్ మరింత ఎక్కువ అవుతోంది. విమర్శలకు కూడా విసుగొచ్చి ఎంజాయ్ చేసేలా తన లైఫ్ స్టైల్ ని మార్చుకున్న ఈ విలక్షణ దర్శకుడు హాట్ హీరోయిన్ తో ఫోటోలకు స్టిల్ ఇచ్చిన తీరు మామూలుగా లేదు.లేటెస్ట్ ప్రాజెక్ట్ థ్రిల్లర్ సినిమా అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించాడు. హాట్ బ్యూటీ అప్సర రాణి అందులో హీరోయిన్ అని వెల్లడించిన డైరెక్టర్ వర్మ.. ఆమె హాట్ ఫొటోలను సైతం షేర్ చేసి కొత్తగా ప్రమోషన్ మొదలుపెట్టేశాడు.ఈమధ్యే అప్సర రాణి అంటూ తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ ఆమెకు సంబంధించిన హాట్ ఫోటోలను నిమిషాల్లోనే వైరల్ అయ్యేలా చేశాడు. ఇక ఆమెతో సరదాగా గడుపుతున్నట్లు కూడా సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసుకున్న వర్మ ఒడిశాలో పుట్టిన ఈ అమ్మాయిని చూడగానే తనకు ఆ రాష్ట్రం మీద గౌరవం పెరిగింది అనే విధంగా కామెంట్స్ చేశారు.అప్సరతో ఆర్జీవి ఎంత చనువుగా ఉంటాడో ఈ ఫోటోలతో క్లారిటీ వచ్చేసింది. ఏకంగా ఆమెను హద్దుకొని ముద్దులతో నలిపేస్తున్నాడు అనే విధంగా నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వర్మలో ఈ ప్లే బాయ్ వేషాలు ఇంతవరకు చూడలేదంటున్నారు. వర్మతో క్లోజ్ గా ఉన్న ఫోటోలను అప్సర తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకే ఆమె ఫాలోవర్స్ పెరిగిపోయారు. అప్సర తెలుగు తెరకు కొత్తేం కాదు తెలుగులో ఉల్లాల ఉల్లాల, 4 లెటర్స్ అనే సినిమాల్లో నటించింది గాని ఆ సినిమాలు క్లిక్కవ్వకపోవడంతో పెద్దగా క్రేజ్ రాలేదు. ఇప్పుడు వర్మ కళ్లలో పడడంతో ఆమె దశ తిరుగుతుందని అంటున్నారు. అంతకుముందు నగ్నం మూవీతో  స్వీటీ తెరమీదకు వచ్చి కుర్రకారుని గిలిగింతలు పెట్టింది. స్వీటీ అచ్చతెలుగు అమ్మాయి. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన యువతి స్వీటీ  వర్మ తెరకెక్కించిన నగ్నంలో హాట్ హాట్‌గా నటించి నెటిజన్లను ఆకర్షించింది. తనపెళ్ళి గురించి, తన భర్త గురించి సంచలన విషయాలు వెల్లడించింది. డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదలైన ఈ మూవీ మంచి కలెక్షన్లు సాధించింది. స్వీటీకి కూడా క్రేజ్ తెచ్చిపెట్టింది.

Related Posts