YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఐదు జిల్లాల్లో కఠినంగా లాక్ డౌన్

ఏపీలో ఐదు జిల్లాల్లో కఠినంగా లాక్ డౌన్

విజయవాడ, జూలై 14, 
ఏపీలో కరోనా పంజా విసురుతూనే ఉంది. పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో పరిస్థితులు మారిపోతున్నాయి. ముందు రెండు, మూడు వారాల పాటూ లాక్‌డౌన్ అమలు చేసిన అధికారులు.. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో కొనసాగిస్తున్నారు. ఐదారు జిల్లాల్లోని వివిధ నగరాలు, పట్టణాల్లో లాక్‌డౌన్ కొనసాగిస్తున్నారు. ఉభయ గోదావరి, ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో నిబంధనలు అమల్లో ఉన్నాయి.తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, అమలాపురంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. కాకినాడలో తిరిగి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతించగా.. ఆ తర్వాత కేవలం నిత్యావసర వస్తువుల దుకాణాలు, మెడికల్ షాపులు మాత్రమే ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటల తర్వాత రోడ్లపైకి జనాలు వచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇటు ఏలూరు. తాడేపల్లిగూడెంలో పూర్తి లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.. అత్యవసర, నిత్యావసర వస్తువులకు మినిహయింపు ఇచ్చారు. జనాలు ఊరికే రోడ్లపై తిరగొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన సమయంలో మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి అంటున్నారు.అనంతపురంలో కూడా  లాక్‌డౌన్ ఆంక్షలు మరింత క‌ఠిన‌త‌రం చేయాల‌ని అధికారులు నిర్ణయించారు. ఉదయం 6 గంట‌ల నుంచి ఉద‌యం 11 గంటల వ‌ర‌కు మాత్ర‌మే జనాలను రోడ్ల‌పైకి అనుమ‌తిస్తారు. ఉదయం 11 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చినా.. తిరిగినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావొద్దంటున్నారు. మాస్కు ధరించకపోయినా.. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి జ‌రిమానాలు విధిస్తారు.ఇటు ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాల, మార్కాపురంలలో లాక్‌డౌన్ కొనసాగిస్తున్నారు. ముందు లాక్‌డౌన్ సడలిస్తారని భావించినా.. మళ్లీ కేసులు పెరగడంతో నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఇటు శ్రీకాకుళం జిల్లాలోని పట్టణాల్లో కూడా లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. శ్రీకాకుళంతో పాటూ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.

Related Posts