YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనా టెస్టుల కోసం క్యూ కడుతున్న హైదరాబాదీలు !

కరోనా టెస్టుల కోసం క్యూ కడుతున్న హైదరాబాదీలు !

హైదరాబద్ జూలై 21 
తెలంగాణలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది . ప్రతి రోజు కూడా వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46 వేలు దాటింది. దీనితో హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వారిలో ఆందోలన పెరిగిపోతుంది. అలాగే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులని సరిగ్గా జరపడం లేదంటూ రాష్ట్ర హైకోర్టు సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనితో హలంనగరంలో ఉంటున్న చాలామంది పల్లెబాట పడుతున్నారు. ఇకపోతే రోజురోజుకి  గ్రేటర్  హైదరాబాద్ పరిధిలో పాజిటివ్ కేసులతో పాటు అనుమానితుల సంఖ్య కూడా పెరిగిపోతుండడంతో తమకు కరోనా సోకిందేమో అని నిర్ధారించుకునేందుకు చాలా మంది ప్రజలు పీహెచ్ సీ కేంద్రాల ఎదుట ఉదయం 6 గంటల నుంచే క్యూలు కడుతున్న దైన్యం హైదరాబాద్ లో కనిపిస్తోంది . పెరుగుతున్న కేసులతోపాటు పీహెచ్ సీల దగ్గరికి జనం భారీగా చేరుకుంటున్నారు. దీంతో చాలా మంది టెస్టుల కోసం పీహెచ్ సీ కేంద్రాల ముందు క్యూ కట్టి ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో మొత్తం 90 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే టెస్టుల కోసం జనం ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిలుచుంటున్నారు. క్యూ లైన్లలో పెరుగుతున్న రద్దీతో టెస్టుల కోసం వచ్చిన జనం ఆందోళనపడుతున్నారు. అయితే రోజుకు కేవలం 40 మందికి మాత్రమే టెస్టులు చేసే అవకాశం వుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు.

Related Posts