YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

నయన ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు

నయన ఫ్యాన్స్  చుక్కలు చూపిస్తున్నారు

చెన్నై, జూలై 24, 
కోలీవుడ్ లో కరోనా కన్నా ఎక్కువ హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి గురించే. వనితా విజయ్ కుమార్ ఈ మధ్యనే తన ప్రేమికుడైన పీటర్ ని మూడో వివాహం చేసుకుంది. దానితో పీటర్ భార్య తనకి విడాకులివ్వకుండా వనితని పెళ్లి ఎలా చేసుకుంటారంటూ  కేసు పెట్టడంతో మొదలైన పెంట.. ఇప్పటికి చల్లారలేదు. వనిత విజయ్ కుమార్ ని వేలెత్తి చూపించిన వారికీ దిమ్మతిరిగే సమాధానాలిస్తుంది వనిత. తాను మూడో పెళ్లి చేసుకుంటే తప్పేమిటి.. ఒక పెళ్లి చేసుకున్నవారంతా పతివ్రతాలా అంటూ ఎదురు దాడి చేస్తుంది.ఇక తనని మూడో పెళ్లి చేసుకున్నావ్ అని హేళన చేస్తున్నవారికి వరస ట్వీట్స్ తో బుద్ది చెబుదామనుకుని ఇప్పుడు వనితానే అడ్డంగా బుక్ అయ్యింది. నయనతార ప్రభుదేవా ని ప్రేమించి పెళ్లాడదామనుకున్నప్పుడు ఆయన తన భర్య రామలతకి విడాకులు ఇవ్వలేదు.. తర్వాత రామలత తన ముగ్గురు పిల్లల్తో ఎలా కష్టాలు పడిందో ట్వీట్స్ మీద ట్వీట్స్ చేస్తూ నయనతారకి ఒక న్యాయం, నాకో న్యాయమా అంటూ ట్వీటడంతో.. నయనతార అభిమానులు వనిత విజయ్ కుమర్ కి సోషల్ మీడియాలో చుక్కలు చూపంచడం స్టార్ట్ చేయడంతో.. వనితా విజయ్ కుమార్ త్వరత్వరతగా తాను చేసిన ట్వీట్స్ ని సోషల్ మీడియా నుండి తొలగించింది. మరి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడి.. ఎవరిని బడితే వాళ్ళని తిడితే ఊరుకుంటారా.. ఇలాగె ఉంటుంది వ్యవహారం.

Related Posts

0 comments on "నయన ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు"

Leave A Comment