YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం విదేశీయం

సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్...

సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్...

ముంబై, జూలై 24, 
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ని ఐసీసీ వాయిదా వేయడంతో.. ఐపీఎల్ 2020‌ని పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. భారత్‌‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో.. ఇప్పటికే యూఏఈ వేదికగా ఐపీఎల్‌ని నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన బీసీసీఐ.. టోర్నీని కూడా 44 రోజుల నుంచి 51 రోజులకి పెంచింది. దాంతో.. షెడ్యూల్‌లో కేవలం ఐదు డబుల్ హెడర్ మ్యాచ్‌లు మాత్రమే ఉండే అవకాశం ఉంది.వాస్తవానికి ఐపీఎల్‌ని తొలుత సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ అంటే.. 44 రోజులు 60 మ్యాచ్‌ల షెడ్యూల్‌ని బీసీసీఐ రూపొందించింది. కానీ.. డబుల్ హెడర్ మ్యాచ్‌ల సంఖ్య దాదాపు పదికి చేరగా.. మరో వారం రోజులు టోర్నీని పొడిగించాలని బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్, ఫ్రాంఛైజీలు బీసీసీఐని కోరాయి. దాంతో.. దీపావళి నేపథ్యంలో యాడ్స్ కోసం నవంబరు 15 వరకూ పొడిగిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. ఎవరూ ఊహించని రీతిలో వారం ముందే ఐపీఎల్.. అంటే సెప్టెంబరు 19 నుంచే ప్రారంభించాలని బీసీసీఐ డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.ఐపీఎల్ 2020 షెడ్యూల్‌పై తాజాగా పీటీఐతో బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘సెప్టెంబరు 19 నుంచే ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. 51 రోజుల ఈ విండోలో మొత్తం 60 మ్యాచ్‌లు జరగనుండగా.. నవంబరు 8న ఫైనల్ నిర్వహిస్తాం. ఈ షెడ్యూల్ బహుశా టోర్నీలోని ఫ్రాంఛైజీలు, బ్రాడ్‌కాస్టర్‌కి కూడా బాగా నప్పుతుంది’’ అని వెల్లడించాడు.

Related Posts