YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్ లో జిఏ2 పిక్చ‌ర్స్ " మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" రొమాంటిక్ పోస్టర్ విడుదల

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్ లో జిఏ2 పిక్చ‌ర్స్ " మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్"  రొమాంటిక్ పోస్టర్  విడుదల

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న చిత్రం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్". టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రెడీ అవుతున్న ఈ సినిమాకి టాలీవుడ్ లో వ‌రుస‌గా భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌, పిల్లానువ్వులేని జీవితం, గీతాగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ తో  మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" సినిమా అనౌన్స్‌  దగ్గర నుంచి అక్కినేని అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్ కు,  అలానే  గొపిసుంద‌ర్ సంగీత‌సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు అటు సోషల్ మీడియా లో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్ లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజగా ఈ సినిమాకు సంబంధించిన  రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేసింది.
అఖిల్‌ అక్కినేని తో రొమాన్స్ చేస్తున్న పూజా హెగ్డే
ఈ రోజు విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లో అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ అక్కినేని వర్క్ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి బుట్ట బొమ్మ పూజా హెగ్డే టీజ్ చేసే ఈ స్టిల్ చూస్తే ప్ర‌తిఓక్క‌రిలో ఒక తెలియ‌ని రొమాంటిక్ ఫీల్ వ‌స్తుంది. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్ తో ల‌వ్ లీగా వుండే కేర‌క్ట‌ర్స్ గా డిజైన్ చేస్తారు. అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఒ స్పెషాలిటి వుంటుంది. అఖిల్ అక్కినేని ,పూజా ల మ‌ద్య ఎలాంటి కెమిస్ట్రి ఈ చిత్రం లో  వుండ‌బోతుందో ఈ పోస్ట‌ర్ డిజైనింగ్ లో చాలా చ‌క్క‌గా, అందంగా చూపించారు ద‌ర్శ‌కుడు భాస్క‌ర్‌.

Related Posts