YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

భక్తే ముఖ్యం :

భక్తే ముఖ్యం :

ఒక్కోసారి మనకు అర్ధం పర్దం లేని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయ్ . పూజానియమాలు తెల్సుకోవడం మంచిదే , పూజలో దోర్లుతున్న తప్పులను సవరించుకోవడం మంచిదే కాని వాటికోసం పూజనే మానివేయడం తప్పు .
దేవుడు ఎంత కారుణ్య ముర్తో చూడండి ..
1. భక్తకన్నప్ప పెట్టిన నైవేద్యం ఏమిటి ? జింక మాంసం .. అయన భక్తితో పెట్టిన నైవేద్యం కాబట్టి దేవుడు స్వీకరించాడు . కాని దేవుడు ఛి నీచుడా . . నీకు ఏమి నైవేద్యంగా పెట్టాలో తెలియదు . నువ్వు స్నానం చేసావా ముందు . విభూది పెట్టుకోలేదు దూరం జరుగు అనలేదు . పరమ సంతోషం తో స్వీకరించాడు . ఇక్కడ అర్ధం చేస్కోవాల్సింది అందర్నీ జింక మాంసం పెట్టమని కాదు శివుడికి జింక మాంసం ఇష్టం అని కాదు . నువ్వు భక్తితో ఏది పెట్టిన భగవంతుడు స్వీకరిస్తాడు .
2. గజేంద్ర మోక్షం లో గజ రాజు ప్రాణం పోతున్నా సమయం లో స్వామి వార్ని పిలిస్తే స్వర్గం లోంచి పరుగెత్తుకుని మరీ వచ్చాడు .. పైగా శంకు చక్రం కూడా తిస్కోనిరాకుండా . లక్ష్మి దేవికి కూడా చెప్పకుండా వచ్చి రక్షించాడు అంతే కాని నీ చిన్నాప్పటి నుంచి ఒకసారి కూడా పూజ చేయలేదు . ఈ టైం లో నీకు గుర్తుకు వచ్చానా .. నీ చావు నువ్వు చావు అనలేదు . ఆపదలో ఉన్నవాణ్ణి కాపాడటానికి ఏ రూపం లో ఐన వచ్చికపాడతాడు ఆయన .
3. ద్రౌపతి అన్న శ్రీ కృష్ణా అంటే వెంటనే వచ్చి వస్త్రాలు ఇచ్చి రక్షించాలేదా ? నిన్ను ముట్టుకోకూడదు మూడు రోజులు తరువాత పిలు వస్తాను . అప్పడివరకు నన్ను తలచకు అని చెప్పలేదే . భక్తీ తో స్వామి నీవే తప్ప నన్ను రక్షించేది ఎవరు అని శరణు వేడితే తప్పకుండ ఏదో ఒక రూపం లో స్వామి పలుకుతాడు .
పూజ చేసేటప్పుడు ఎన్ని వత్తులు వెయ్యాలి .. అవి ఎ దిక్కుకు తిప్పాలి . ఎ నూనేతో వెలిగించాలి అంటూ పూజ ప్రారంభం లోనే సవాలక్ష ప్రశ్నలతో మొదటిలోనే అడిగిపోతే ఎప్పుడు పైకి వస్తావ్ నువ్వు . ఎప్పుడైనా ఒక్కటే గుర్తు పెట్టుకో .. స్వామి కి కావాల్సింది భక్తి తప్ప అంగులూ ఆర్భాటాలు కావు . ఏదైనా పూజలోనో వేరే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు తప్పులు దొర్లితే స్వామి ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించు తండ్రి అంటే అయన చిరునవ్వుతో మన్నిస్తాడు . తెలిసి కూడా తప్పుచేసి కవర్ చేసే పనులు మాత్రం చేయకూడదు.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts