YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఖైదీగా కార్తీక్

ఖైదీగా కార్తీక్

ఖైదీగా కార్తీక్
చెన్నై, 
తమిళనాట లోకేష్ క‌న‌క‌రాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ సినిమా కేవలం తమిళంలోనే కాదు, తెలుగులోనూ బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. తండ్రి కూతురు మధ్యన నడిచే ప్రేమ ఎమోషన్, పోలీస్ లు స్మగ్లర్స్ మధ్యన నడిచే సంఘర్షణ, మధ్యలో ఎటువంటి సందబంధం లేని హీరో పోలీస్ లకు సహాయం చెయ్యడం, ఓ స్టూడెంట్ గ్యాంగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుని పోలీస్ స్టేషన్ లో ఉండగా.. పోలీస్ స్టేషన్ ని సేవ్ చేసందుకు ప్రాణాలకు తెగించి ఫైట్ చెయ్యడం అంతటిని దర్శకుడు ఒకే ఒక రాత్రిలో సినిమాని చూపించాడు. ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి. దానికి సీక్వెల్ ని కూడా దర్శకనిర్మాతలు ఖైదీ విడుదలకు ముందే ప్లాన్ చేసారు. కాబట్టే కార్తీ ఫ్లాష్ బ్యాగ్ చెప్పకుండా సీక్వెల్ కోసం దాచేసారు.అలాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా భారీ గా ఆదరించడంతో ఇప్పుడు ఖైదీ దర్శకనిర్మాతలు తెలుగు ప్రేక్షకుల కు నచ్చేలా, తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటులను కూడా ఖైదీ సీక్వెల్ కి తీసుకోబోతున్నారట. ఖైదీ సినిమాలో కార్తీ తప్ప మిగతా మొహాలేవీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేనివే. అందుకే ఈసారి తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని దర్శకనిర్మాతలు తెలుగులో ఓ యంగ్ హీరోని ఖైదీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం తీసుకోబోతున్నారట. ఈ యంగ్ హీరో పాత్ర క‌థ‌కు చాలా కీల‌క‌మ‌ని తెలుస్తోంది. ఇక ఖైదీ సినిమాలో హీరోయిన్ లేదు. ఆ అవ‌స‌రం కూడా రాలేదు. కానీ ఖైదీ  సీక్వెల్ లో మాత్రం హీరోయిన్ పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పాత్ర‌లోనూ తెలుగు – తమిళ్ కి బాగా ప‌రిచ‌య‌మున్న హీరోయిన్ నే తీసుకోవాల‌ని భావిస్తున్నారు.

Related Posts