YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

ఆది దేవుడికి ఈ నెల 22 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఆది దేవుడికి ఈ నెల 22 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు

కాణిపాకం ఆగస్ట్ 08
కరోనా వైరస్ కారణంగా కాణిపాకo బ్రహ్మోత్సవాల్లో  భాగంగా ఈ నెల 22 వ తేది శనివారం జరిగే వినాయక చవితి పండుగ సంధర్భంగా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని దర్శించేందుకు పరిమిత సంఖ్యలోనే భక్తాదులు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త పేర్కొన్నారు.  శనివారం చిత్తూరు డివిజన్, ఐరాల మండలంలోని కాణిపాకంలోగల స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం నందు జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలో కాణిపాకంలో ఈ నెల 22 నుండి సెప్టంబర్ 11 వ తేది వరకు జరగబోయే స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి వార్షిక బ్రంహోత్సవాల ముందస్తు ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 22 వ తేది నుండి సెప్టంబర్ 11 వ తేది వరకు జరగబోయే స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి వార్షిక బ్రంహోత్సవాలను పకడ్భందీగా నిర్వహించాలన్నారు.  ఈ బ్రంహోత్సవాలకు సంబందించి అధికారులకు  ఏదైతే విధులు కేటాయించామో ఆ విధులను పక్కాగా నిర్వహించాలన్నారు.  అలాగే మెడికల్ ఆఫీసర్ ను కూడా నియమించడం జరుగుతుందన్నారు.  కరోనా వైరస్ కారణంగా 60 సంవత్సరాలు పై బడిన వారు, 10 సంవత్సరాల లోపు పిల్లలు ఆలయానికి రాకుండా ఉంటే మంచిదని తెలిపారు. బ్రంహోత్సవాల సంధర్భంగా పరిమితి సంఖ్యలోనే భక్తాదులు రావాలన్నారు. కౌంటర్లు బయట ఏర్పాటు చేసి టికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.  దర్శనానికి వచ్చే భక్తాదులు విధిగా మాస్కులు దరించాలని, చేతులను శ్యానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని, అలాగే భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.  నిర్ణీత సమయం లోగానే భక్తాదులు స్వామి వారి దర్శనానికి రావాలని తెలిపారు. ఆలయ ప్రాకారం లోనే శాస్త్ర ప్రకారం స్వామి వారి ఊరేగింపు ఉంటుందని తెలిపారు. బ్రంహోత్సవాల సంధర్భంగా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి వారు భక్తాదుల సౌకర్యార్ధం బస్సుల ఏర్పాట్లకు చర్యలు చేపట్టాలన్నారు.  కరోనా నేపధ్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన విధంగానే కాణిపాకం లో కూడా వైధ్య శాఖ వారు ర్యాండoగా చెక్ చేయడం జరుగుతుందన్నారు.  అనంతరం ఎస్.పి.శెందిల్ కుమార్ మాట్లాడుతూ బ్రంహోత్సవాల సంధర్భంగా పక్కాగా బందోభస్తు ఏర్పాట్లకు చర్యలు చేపడతామన్నారు.  ఆలయ ఈ.ఓ వేంకటేశు మాట్లాడుతూ బ్రంహోత్సవాల సంధర్భంగా ఆలయానికి వచ్చే భక్తాదులు విధిగా మాస్కులు ధరించాలని, శ్యానిటైజర్ తో చేతులు శుభ్ర పరుచుకోవాలని అలాగే భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి ఈశ్వర్ రెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts