YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కరోనా నేపథ్యంలో రెండు అడుగుల మట్టి విగ్రహాన్ని పూజించాలి కమిషనర్ గిరీష

కరోనా నేపథ్యంలో రెండు అడుగుల మట్టి విగ్రహాన్ని పూజించాలి కమిషనర్ గిరీష

తిరుపతి
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వినాయక చవితి పండుగకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమావేశమైన తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ గిరీష  అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి  తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సామoచి శ్రీనివాస్,సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి,మాంగాటి గోపాల్ రెడ్డి,ఆర్సి మునికృష్ణ,గుండాల గోపీనాథ్ రెడ్డి,మస్తాన్ నాయుడు చెన్నం నవీన్ తదితర సభ్యులు పాల్గొన్నారు ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి.
1) తిరుపతి నగరంలో భారీ విగ్రహాలకు ప్రధాన కూడళ్లలో మండపాలకు అనుమతి లేదు.
తిరుపతిలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్యాత్మిక చింతనతో నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు అడుగుల మట్టి వినాయక విగ్రహాల తోనే పూజలు నిర్వహించాలని ఇప్పటికే మీడియా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
) తిరుపతి నగర ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని వినాయక చవితి పండుగ నాడు పూజా సామాగ్రి విక్రయించే ప్రాంతాలలో నగర పాలక సంస్థ పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా ప్రజలు గుంపులుగా చేరకుండా వైరస్ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.  తిరుపతి నగరంలోని వీధులలో గల దేవాలయాల ముందు కేవలం రెండు అడుగుల మట్టి వినాయకుడి విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసుకుని భౌతిక దూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అదే రోజు సాయంత్రం అక్కడే ఓ పాత్రలో పెట్టి వినాయక నిమజ్జనం చేసి ఆ పవిత్ర జలాన్ని మొక్కలకు వినియోగించుకునేలా నగర పాలక సంస్థ అధికారులు సైతం ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.  వినాయక విగ్రహ భారీ మండపాలను గతంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన నిర్వాహకులతో అధికారులు చర్చించి ప్రస్తుత పరిస్థితులను వివరించి వారిని కూడా ఒప్పించే బాధ్యత పోలీస్ అధికార యంత్రాంగం చూసుకుంటుందని వినాయకచవితి నిర్వహణ బాధ్యతలు చూసేలా ప్రత్యేక పోలీస్ అధికారిని నియమిస్తామని మండప నిర్వాహకులతో అవసరమైతే జూమ్ యాప్ ద్వారా అయినా లేక మొబైల్ ఫోన్ ల ద్వారా మాట్లాడి అవగాహన కల్పిస్తామని వైరస్ వ్యాప్తి చెందకుండా నగర ప్రజలు అందరూ సహకరించాలని అర్బన్ ఎస్పి తెలిపారు.  తిరుపతి నగరంలో వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్ల ద్వారా ఆ పరిసర ప్రాంతాల లో నివాసం ఉంటున్న ప్రజలకు చిన్న మట్టి విగ్రహాలతో ఇంటిలో పూజలు చేసి అక్కడే నిమర్జనం చేసేలా అవగాహన కల్పిస్తామన్నారు ప్రజల సౌకర్యార్థం అవసరమైతే వార్డు సచివాలయాల వద్ద వినాయక విగ్రహాల తయారీకి వినియోగించే మట్టిని ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ తెలిపారు. తిరుపతి నగర ప్రజలందరికీ ఫోన్ మెసేజ్  ద్వారా వినాయక చవితి పండుగకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై నగర పాలక సంస్థ అధికారులు అవగాహన కల్పిస్తూ సమాచారం ఇవ్వాలని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.  వినాయక సాగర్ లో మరమ్మతుల కారణంగా నీటిని పూర్తిగా తొలగించేశామని ప్రజలు ఎవరు కూడా ఎటువంటి వినాయక విగ్రహాలను(చిన్నవి పెద్దవి గాని) నిమజ్జనం కొరకు వినాయక సాగర్ కు తీసుకురావద్దని స్థానిక ఎమ్మెల్యే నగరపాలక సంస్థ పోలీస్ అధికారులు ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేశారు!

Related Posts