YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*సురభి అను నామమున కామధేనువు జన్మించినది ఎలా?

*సురభి అను నామమున కామధేనువు జన్మించినది ఎలా?

భూయస్తాం నిజకులముఖ్య వత్సయుక్తైః
దేవాద్యైః సముచితచారుభాజనేషు,।
అన్నాదీన్యభిలషితాని యాని తాని
స్వచ్ఛందం సురభి తనూమదూదుహస్త్వమ్।।
భావం:-
అనంతరము - భూమి నీప్రేరణచే ‘ సురభి‘ అను నామమున ‘కామధేనువు‘ రూపమును ధరించినది. ప్రధాన దేవతలు గోవత్సములు (ఆవు దూడలు) కాగా-ఇతర దేవతలు సముచిత పాత్రలు చేతపట్టిరి. నీవు వారిచేత ‘ఆహారమయక్షీరమును‘ మరియు ఇతర 'అభిలిషిత పదార్ధమయ క్షీరములను' వారిచే పితికించితివి. శ్రీహరీ! ఇది యంతయూ నీ సంకల్పమువలననే జరిగినది.
వ్యాఖ్య:-
మృత్యుదేవుని పుత్రిక అయిన సునీధ అంగరాజుల సంతానము వేనుడు. అధర్మ ప్రవర్తకుడు కుమారుడిగా పొందగలదని శాపాన్ని పొందిన సునీధస్నేహితురాలైన రంభ సలహా మేరకు ఋషుల వలన ధర్మప్రవృత్తుడైన పుత్రుడు కలుగుతాడని వరము పొందిన అంగరాజును వివాహమాడింది. అయిననూ వేనుడు అధర్మప్రవక్తుడైనాడు.
వేనుడి అధర్మప్రవర్తనతో కోపించిన ఋషులు కుశ ప్రహారముతో దక్షిణబాహువుని వధించగా పుట్టినవాడు పృథు చక్రవర్తి. పృథువు పుట్టుకతో వేనుని పాపాలన్నీ హరించిపోయి మోక్షాన్ని పొందాడు.
వేనుని పాప ఫలితము వలన పంటలు పండకపోవడంతో పృథు చక్రవర్తి ఆగ్రహంతో ధనస్సును ధరించి భూమిని హరింప చూడగా రాజు ఆగ్ర హిస్తే రాజ్యం, ప్రజలు నశిస్తారని ఉపాయంతో కార్యం సాధించాలని భూమాత ఉపదేశించెను.
తాను గోరూపాన్ని ధరిస్తానని తగిన దూడను ఏర్పరచి కావాల్సిన పంటలను పాలరూపంలో తీసుకోమని భూమాత ఆదేశించింది.
పృథువే దూడగా మారి ప్రజలకు కావాల్సిన పంటలను పాలరూపంలో తీసుకున్నారు. ఈవిధంగా ఎవరికి ఏమేమీ కావాలో వారు దూడగా మారి కావాల్సిన వాటిని పాలుగా తీసుకున్నారు.
మేరు పర్వతం దూడగా మారి రత్నాలను, వాసుకి దూడగా మారి విషాన్ని, వృక్షాలు దూడగా మారి ఫలాలను ఇలా నశించిన సకల సంపదలను గోరూపంలో ఉన్న భూదేవి నుండి పృథు చక్రవర్తి ప్రజలకు అందించాడు. ఈనాడు మనం అనుభవిస్తున్న సంపద అంతా పృథు చక్రవర్తి అందించినదే.
వర్షాలు పడనపుడు సాగు, తాగు నీరు అందించడానికి ఎన్నో ఆనకట్టలను కట్టించిన సాగు, తాగునీటి నిపుణుడు పృథుచక్రవర్తి. పర్వత ప్రాంతాలలో ఎత్తుపల్లాలను సమానంగా చేసి నగరాలను, పట్టణాలను, తాలుకాలను, గ్రామాలను, తండాలను ఇత్యాది జననివాస వ్యవస్థను ఏర్పరచిన సివిల్ ఇంజనీర్ పృథుచక్రవర్తి. నదీప్రవాహాన్ని పట్టణ, గ్రామ పరిసరాలకు ప్రవహించేలా కాలువలు, సెలయేర్లు మొదలగు జలప్రవాహ వ్యవస్థను, జలప్రవాహ ఘర్షణ నుండి వి ద్యుత్ను ఏర్పరచి జలవిద్యుత్ వెలుగులు అందించాడు. ఈనాటి నాగరిక జనజీవన విధానమంతా పృథుచక్రవర్తి మేథాసంపత్తితో దూరదృష్టితో, ధర్మప్రవృత్తితో సకల ప్రాణుల సంక్షేమ కాంక్షతో ఏర్పడినదే.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts