YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

నిమ్స్‌లో కోబాస్ 8800 మెషీన్‌

నిమ్స్‌లో కోబాస్ 8800 మెషీన్‌

హైద్రాబాద్, ఆగస్టు 13 
హైదరాబాద్ నిమ్స్‌లో కోబాస్ 8800 మెషీన్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా రోజూ 3 వేలకుపైగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెరగనుంది.తెలంగాణలో కరోనా టెస్టులు పెంచాలని ప్రధాని మోదీ సూచించిన సంగతి తెలిసిందే. ఇటీవల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా టెస్టులు తక్కువగా చేస్తున్న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఈ సూచన చేశారు. తెలంగాణ సర్కారు ప్రస్తుతం 22-23 వేల వరకు టెస్టులు చేస్తుండగా.. రోజుకు 40 వేల టెస్టులు చేయాలని ఆగష్టు 5న జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. కానీ ఇప్పటికీ 40 వేల టెస్టులు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు 3 వేలకుపైగా కరోనా టెస్టులు చేసే కోబాస్ 8800 మెషీన్ నిమ్స్‌లో ఏర్పాటైంది.రూ.7 కోట్ల వ్యయంతో అమెరికా నుంచి తెప్పించిన ఈ మెషీన్‌ను బుధవారం నిమ్స్‌లో ఏర్పాటు చేశారు. దీనికి ల్యాబోరేటరీ కోసం మరో కోటి రూపాయలు ఖర్చు చేశారు. వారం రోజుల్లో ఈ మెషీన్ ద్వారా టెస్టులు చేయడం ప్రారంభిస్తారు. ప్రస్తుం రాష్ట్రంలో రోజుకు 6600 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తుండగా.. కోబాస్ మెషీన్ అందుబాటులోకి వస్తే.. ఈ సంఖ్య పది వేలకు చేరుతుంది.వాస్తవానికి జూన్ నెలలో రాష్ట్రానికి రావాల్సిన కోబాస్ మెషీన్‌ను కేంద్రం పశ్చిమ బెంగాల్‌కు మళ్లించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్‌)లో భాగంగా రాంకీ సంస్థ అమెరికాలోని రోంచే కంపెనీ నుంచి ఈ మెషీన్‌ను బుక్ చేసింది. కానీ కేంద్రం దాన్ని కోల్‌కతాకు మళ్లించింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి తెలంగాణ కోసం మరో కోబాస్ మెషీన్‌ను బుక్ చేశారు

Related Posts