YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అక్క మహాదేవి - ఒక అద్భుత భక్తురాలు!

అక్క మహాదేవి - ఒక అద్భుత భక్తురాలు!

భక్తులు పూర్తిగా భిన్నమయిన మనుష్యులు. వారు ఈ లోకానికి చెందినవారు కాదు. వారు ఈ లోకంలో ఒక పాదాన్ని మాత్రమే ఉంచి ఉంటారు. వారు జీవించే విధానం, వారి జీవన శక్తి పూర్తిగా పరలోకానికి చెందినవై ఉంటాయి. అలాంటి అద్భుత భక్తుల్లో ఒకరు అక్క మహాదేవి.
అక్క మహదేవి శివ భక్తురాలు. శివుడే తన భర్తగా భావించేది. చిన్నతనం నుండి తనని తాను పూర్తిగా శివునికి అంకిత మిచ్చింది. యుక్త వయస్సులో ఉన్న ”అక్క”ను ఒక రోజు ఒక రాజు చూశాడు. ఆమె చాలా అందంగా ఉండటం వల్ల పెళ్ళి చేసుకొవాలని భావించాడు. కాని అక్క అంగీకరించక పోవటం వలన, ఆ రాజు ”నీవు వివాహానికి అంగీకరించనిచో నీ తల్లి తండ్రులను చంపుతానని బెదిరించాడు”. అందువలన ఆమె రాజుని పెండ్లి చేసుకున్నా, అతనిని దూరంగా ఉంచేది. రాజు ఆమెను లోబరుచుకోవాలని చాలా ప్రయత్నాలు చేసినా, ఆమె, ”నేను శివుడిని ఎప్పుడో పెండ్లాడాను, నిన్ను కాదు” అని తప్పించుకునేది. కొంతకాలానికి రాజుకి సహనం నశించింది. ఆమెను వశపరుచుకోటానికి ప్రయత్నించినా, ఆమె అతనిని తిరస్కరించి, ”నాకు వేరే చోట మరో భర్త ఉన్నాడు, అతను నా దగ్గరకు వస్తూ ఉంటాడు. నేను అతనితోనే ఉంటాను, నీతో ఉండలేను” అని చెప్పేది.
దీనిని రాజు సహించలేక, "ఇలాంటి భార్యతో ఉండి ఏం ప్రయోజనం? కనిపించని వేరే అతనిని పెళ్ళి చేసుకున్న భార్యతో ఎలా ఉండటం?" అని అనుకొన్నాడు. ఆ రోజుల్లో విడాకులు లాంటివి లేవు. అతనికి ఏమి చెయ్యాలో తోచలేదు. అందువలన ఆమెను రాజ సభకి తీసుకుని వచ్చి, సభను నిర్ణయించమన్నాడు. సభలో ఆమెను ప్రశ్నించగా, ఆమె వేరొకచోట ఉన్న తన భర్త గురించి మాత్రమే మాట్లాడింది. ఆమెకు ఇది 100% ఫూర్తి వాస్తవం, ఇదంతా భ్రమ కాదు.
ఆ రోజుల్లో, భారతదేశంలో ఒక స్త్రీ కి, తన భర్తను, ఇంటినీ వదిలి వెళ్ళాలనే ఆలోచనకు తావు ఇవ్వడమే చాలా కష్టం. కాని ఆమె అలా చేసింది
సభలో ఉన్న ప్రజలందరి ముందు, ఆమె తన భర్త మరొక చోట ఉన్నాడని చెప్పటంతో, రాజు చాలా కోపగించుకున్నాడు. భారతదేశంలో ఉన్న రాజుకి ఈ విషయాన్ని తేలికగా అంగీకరించటం అసాధ్యం. ఆమె మనసులో ఏముందో కాని, సాంఘికంగా అది చిన్న విషయం కాదు. అప్పుడు రాజు "నీవు ఇంతకు ముందే వేరొకరిని పెండ్లాడినచో, నాతో ఏమి పని? వెళ్ళిపో!" అన్నాడు. "సరే!" అని ఆమె బయటకు నడవటం మొదలు పెట్టింది. ఆ రోజుల్లో, భారతదేశంలో ఒక స్త్రీ కి, తన భర్తను, ఇంటినీ వదిలి వెళ్ళాలనే ఆలోచనకు తావు ఇవ్వడమే చాలా కష్టం. కాని ఆమె అలా చేసింది. ఆమె అలా ప్రశాంతతతో, తేలికగా తనను వదిలి వెళ్ళగలగడం చూసిన రాజు తనలోని కోపం వల్ల హీనంగా, "నీవు ధరించిన వస్త్రాలు, నగలు నావే. వాటిని కూడా విడిచి వెళ్ళు" అన్నాడు. నిండు సభలో, 17, 18 సం.ల యుక్త వయస్సులో ఉన్న ఆమె, అన్నింటిని విసర్జించి, నగ్నంగా బయటకు వెళ్ళింది.
ఆ రోజు నుండి ఆమె బట్టలు ధరించటానికి నిరాకరించింది. దీనివలన సమస్యలు రావచ్చని, చాలామంది ఆమెను బట్టలు ధరించమని నచ్చచెప్పినా, జీవితాంతం ఆమె వివస్త్రగానే జీవించి, ఒక ఋషిగా గుర్తింబడింది. ఆమె చిన్నతనంలోనే మరణించినా, ఆ కొద్ది కాలంలోనే తన భక్తితో శివుని మీద కొన్ని వందల అద్భుత పద్యాలను రచించింది.
ఆమె భక్తి ఎలాంటిదంటే, ప్రతిరోజూ శివుడిని "శివా! నాకు ఎలాంటి ఆహారం అందకుండా చేయి. నేను ఆహారం తీసుకుంటే, నా శరీరం తృప్తి చెందుతుంది. నా వేదన ఏమిటో నా ఈ శరీరానికి తెలియదు. నేను నీలో ఐక్యం అవ్వాలని పడే ఈ తపన నా శరీరాన్ని కూడా పడనీ. అందువలన, ఏ ఆహారం నా వద్దకు రానీకు. ఎప్పుడైనా ఒకవేళ నా చేతిలోకి ఆహారం వస్తే, అది నా నోటిలోకి చేరేలోపే దానిని మట్టిలో పడవేయి. ఆ మట్టిలో పడినదానిని అవివేకినైనా నేను తీసుకునేలోపే, ఒక శునకము వచ్చి తీసుకుపోయేట్లు చేయి” అని అర్ధించేది. ఇదీ ఆమె ప్రతిరోజూ చేసే ప్రార్ధన
ప్రార్థన ఫలితం
ఎంతటి అర్ధబలం ఉన్నా, అంగబలం ఉన్నా, అధికార బలంఉన్నా, మానవమాత్రుడైన ప్రతివ్యక్తికి తన జీవనయాత్రలో ఏనాడో ఒకనాడు క్లిష్టతర సమస్యలను ఎదుర్కొనక తప్పదు. పరమాత్మ కరుణకు పాత్రుడైనవాడు ఎట్టి కష్టాలనైనా సునాయాసంగా ఎదుర్కొనగలడు. ఆ దయా సముద్రుని కరుణకోసం మనకు లభించిన 24 గంటల కాలంలో కనీసం ఓ గంట అయినా త్రికరణసుద్ధిగా ఆ దేవదేవుని ప్రార్థించడం ఎంతైనా అవసరమే. శ్రద్ధ, భక్తి విశ్వాసాల స్థాయికి అనుకూలంగా సకాలంలో సత్వర ఫలితాలను పొందవచ్చు. విశేషించి ఈ కలియుగంలో భగవచ్ఛక్తి ఎట్టిదో, మహాత్మ్యాలు ఎంత శక్తి సంపన్నమైనవో వర్ణించగలవారు లేరు. అందుకు మచ్చుతునకగా ఈ ఉదాహరణ.
ఓ భయంకర అరణ్య మధ్యభాగంలో పూర్ణగర్భవతి అయిన ఓ లేడి పచ్చిక కోసం తిరుగుతుండగ, వేట కోసం వేటగాడు పెట్టిన వలలో చిక్కుకు పోతాననుకుంటూ వెనుకకు మరలేసరికి, ఆ వైపు నుండి వేటకుక్కలు రెండు భయంకరంగా మొరుగుతూ తన వైపే రావడం చూసి, ఎడమవైపుకు తిరిగి అలా పోదామనుకునే సరికి, ఆహారం కోసం వస్తూన్న ఎలుగుబంటి తనమీదకు రావడం చూసింది. పోని, కుడివైపు తిరిగి ఆ దిశగ పోదామంటే తమ వైపే శరవేగంతో వస్తున్న ఓ తోడేలు దాని కంటబడింది. భగవంతుడా? ఏమిటీ దశ? ఎలా పోదామన్నా మృత్యువే కనబడుతున్నదే అనుకొంటూ ఉండగా, ఆ ప్రక్కనే ఉన్న మర్రిచేట్తునెక్కి తనవైపు గురుచూస్తూ వేటగాడు బాణాన్ని ధనస్సుకు సంధిస్తున్న దృశ్యం కనబడింది.
అంతలోనే దావానలంవల్ల దగ్ధమవుతున్న అరణ్య పరిసర ప్రదేశమంతా కనిపిస్తోంది. ఆ దావానలం నుండి బయల్వెడలిన పొగలకూ, అగ్నిజ్వాలలకూ కొండగుహలలో నిదురిస్తున్న సిమ్హాలు బయటకు వచ్చి, కొండ శిఖరాలను ఎక్కి భయంకరంగా గర్జించసాగాయి. ఆ భయంకర గర్జనలకు అరణ్యంలోని మృగాలన్నీ తల్లడిల్లిపోసాగాయి.
అట్టి భయంకర విపత్కర పరిస్థితి ఎదురవడంతో, పిల్లలతో సహా ఆ లేడి గజగజలాడ సాగింది. అప్పుడు ఆ లేడి వేదన పడూతూనే – కన్నులు మూసికొని ‘లక్ష్మినాథ: త్వమిహశరణం కిం కరోమి క్వయామి?’ ఆర్తత్రాణ పరాయణా! ఆది నారాయణ! భయంకరమైన ఈ విపత్తు నుండి నీవు తప్ప మమ్మల్ని రక్షించగల వారెవరు తండ్రి! అంటూ ఆర్తనాదం చేసింది. మనసావాచాకర్మణా – పరమాత్మను నమ్మి చెడినవారు ఈ ప్రపంచంలో ఉన్నారా?
మర్రిచెట్టు మీదన్నున్న వేటగాణ్ణి కాలసర్పం కాటువేయడంతో ‘అబ్బా’ అంటూ వాడు నేలకూలాడు. వాడి చేతులోని నిశిత శరం వచ్చి ఎలుగుబంటికి తగిలి, అది వేంటనే మరణించింది. తమ వేట జంతువును తోడేలు కొట్టుకు పోతుందేమోనని వేటకుక్కలు దాని వెంటబడి తరుముకుంటూ అడవిలోకి దూరంగా పోయాయి. ఈలోగా ప్రచండ వాయు ప్రేరణవల్ల దావానలం నుండి అగ్ని కణం ఒకటి వచ్చి వలమయంలోనే అంబరమంతా కారు మేఘాలతో నిండి కుంభవౄష్టి కురిసి దావానలమంతా చల్లారిపోయింది. పూర్ణ గర్భవతి అయిన ఆ హరిణి ప్రసవించ, నవజాత శాబకాలు మాతృస్తన్యాన్ని పానం చేయసాగాయి! చూశారా! కరుణాసముద్రుడైన నారాయణ దేవుని అనుగ్రహం! ఆస్థితిని చూసి ఆ కురంగం ఎంతగా ఉప్పొంగిపోయింతో అనుభవైకవేద్యమైనది. అపార కరుణావరుణాలయుడైన శ్రీహరిని స్మరించుకొంటూ అది తన బిడ్డలతో సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఇది కేవలం లేడి గురించి చెప్పిన కథ మాత్రం కాదు. మనుష్యుడై పుట్టినవాడు తన జీవయాత్రలో ఎప్పుడో ఒకప్పుడు క్లిష్టతర సమస్యలను ఎదుర్కొనక తప్పదు. వాని అంగబలం, అర్థబలం, అధికార బలం ఇవన్నీ కలిసినా సమస్యలు తీరవు. వార్థక్యంలో సాధన చేద్దాంలే, ఇప్పటి నుండీ ప్రార్ధన ఎందుకు? అని అనుకోక, ధ్రువ, ప్రహ్లాదులవలె చిన్ననాటి నుండి దైవ ప్రార్థన చేసికొంటూ, కుటుంబపరివార, అనుచర, సహచర వర్గానికి కూడా దైవకరుణ, లీలామహాత్మ్యాదులను గురించి బోధించి అనేకులను తరింపజేసి, జన్మను చరితార్థం చేసుకోవాలి...స్వస్తి..

Related Posts