YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

రోడ్డుపై చెప్పులు అమ్ముకుంటున్న టీచర్

రోడ్డుపై చెప్పులు అమ్ముకుంటున్న టీచర్

విజయవాడ, ఆగస్టు 31
కరోనా, ఆ వెంటనే లాక్‌డౌన్ ఎంతోమందిని రోడ్డున పడేసింది. ఉపాధి దొరక్క.. ఉద్యోగాలు లేక.. ఉన్న ఉద్యోగాల్లో నుంచి తొలగించడంతో కష్టాలు మొదలయ్యాయి. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు కూడా గడ్డుకాలం ఎదురవుతోంది. విద్యాసంస్థలు మూతపడటంతో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. విజయవాడలోనూ అదే జరిగింది.. లాక్‌డౌన్ దెబ్బకు ఓ టీచర్ బతుకుచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.. కుటుంబ పోషణ కోసం రోడ్లపై చెప్పులు అమ్మాల్సి వచ్చింది.విజయవాడకు చెందిన టి.వెంకటేశ్వరరావు లెక్కల మాష్టారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడలోని మూడు ప్రైవేటు స్కూళ్లలో వెంకటేశ్వరరావు పార్ట్ టైమ్ జాబ్ చేసేవారు. టెన్త్ క్లాస్ విద్యార్థులకు గణితం బోధించేవారు. ఇదే సమయంలో కరోనా ఆయన్ను కష్టాల్లోకి నెట్టేసింది.. ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కుటుంబ పోషణ కూడా కష్టతరంగా మారింది. అందుకే ఉపాధి కోసం చెప్పులు అమ్మాలని నిర్ణయించుకున్నారు.విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో చెప్పులు అమ్ముతున్నారు. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐదు నెలల నుంచి జీతాలు లేవు.. చేతిలో రూపాయి ఆదాయం లేదు.. అప్పు పుట్టడం లేదు. దీంతో మరో మార్గం లేక ఇలా చెప్పులు అమ్ముకుంటున్నట్లు వెంకటేశ్వరరావు అంటున్నారు. ఈయన ఒక్కరే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇలా ఉపాధి కోసం టిఫిన్ సెంటర్లు, అరటి పళ్లు అమ్ముకోవాల్సి వస్తోంది

Related Posts