YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

స్వక్షేత్ర షడ్గ్రహ యోగం- సకల శుభప్రదం

స్వక్షేత్ర షడ్గ్రహ యోగం- సకల శుభప్రదం

ప్రస్తుతం అద్భుతమైన స్వక్షేత్ర గ్రహస్థితి ఆకాశంలో ఏర్పడి ఉంది.
ఈ కాలాన్ని అందరూ దైవ పరంగా సద్వినియోగం చేసుకోగలరు.
2020సెప్టెంబర్ 3 తారీఖు  నుండి స్వక్షేత్ర పంచ గ్రహకూటమి మొదలైంది. 2020 సెప్టెంబర్ 17 వరకు ఈ పంచ గ్రహ కూటమి ఉంటుంది.
13, 14, 15 తారీకులలో స్వక్షేత్ర షడ్ గ్రహయోగం కూడా ఉండటం వల్ల ఇంకా విశేషమైన రోజులు ఇవి.
సూర్యభగవానుడు సింహరాశిలో స్వక్షేత్రంలో  సంచరిస్తున్నారు.
చంద్రుడు కర్కాటకరాశిలో స్వక్షేత్రంలో  సంచరిస్తున్నారు.
కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో  సంచరిస్తున్నారు.
బుధుడు కన్య రాశిలో స్వక్షేత్రంలో  సంచరిస్తున్నారు.
గురువు ధనస్సు రాశిలో స్వక్షేత్రంలో  సంచరిస్తున్నారు.
శని మకర రాశిలో స్వక్షేత్రంలో  సంచరిస్తున్నారు.
వీరందరూ వారి వారి సొంత గృహాలలో ఉండటం చాలా అరుదుగా సంభవించే సన్నివేశం. ఈ అరుదైన షడ్గ్రహ యోగం శుభాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజులలో విశేషమైన గ్రహబలం మానవులకు లభిస్తుంది.
భాద్రపదం శూన్యమాసం అవటంవల్ల కేవలం దైవారాధనకే ప్రాధాన్యత.
ముఖ్యంగా ఆరోగ్యం కోసమై 13, 14, 15 తారీకులలో చేసే దైవారాధనలు బాగాఫలిస్తాయి.  విశేషించి వృశ్చిక లగ్నంలో చేసే దీపారాధన, పూజలు, జపాలు,  అభిషేకాలు, విష్ణు, శివ లలితా సహస్రనామ పారాయణలు  విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాయి.
ఒకటవ యోగం:  13వ తేదీ ఆదివారం భాద్రపద బహుళ ఏకాదశి పునర్వసు నక్షత్రం, వరీయాన్ యోగం, బవకరణం. వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం ఉదయం 11:36 నుండి 11:51 వరకు. ఈ సమయంలో దైవారాధన ప్రారంభించాలి.
రెండవ యోగం:    14వ తేదీ సోమవారం భాద్రపద బహుళ ద్వాదశి పుష్యమి నక్షత్రం, పరిఘయోగం కౌలవకరణం. వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం
ఉదయం 11:32 నుండి 11:47 వరకు. ఈ సమయంలో దైవారాధన ప్రారంభించాలి.
మూడవ యోగం: 15వ తేదీ మంగళవారం భాద్రపద బహుళ త్రయోదశి ఆశ్లేష నక్షత్రం, సిద్ధయోగం, గరజికరణం. వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం
ఉదయం 11:28 నుండి 11:43 వరకు. ఈ సమయంలో దైవారాధన ప్రారంభించాలి. ఈ సమయంలో చేసే  దీపారాధన, ధ్యానము, జపం అధిక శక్తినిస్తాయి.
ఇట్లు సిద్ధాంతి పంచాంగ కర్త
డాక్టర్ శంకరమంచి రామకృష్ణశాస్త్రి పిహెచ్ డి

Related Posts