YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మధ్యకైలాశ్ ఆలయం -- చెన్నై

మధ్యకైలాశ్ ఆలయం -- చెన్నై

చెన్నై నగరంలోని అడయార్ కస్తూరిభాయ్ నగర్ రైల్వేస్టేషన్ నుండి ఓఎంఆర్ రోడ్ కు వెళ్లే మార్గంలో కొలువై ఉన్న ఆలయం మధ్యకైలాష్. భక్తుల కొంగుబంగారమై కోర్కెలను తీరుస్తూ అలరిస్తోంది. ఈ ఆలయంలో విగ్రహం చాలా ప్రత్యేకం. చూశారంటే ఆశ్చర్యం కలుగుతుంది.  మధ్యకైలాష్ లో ఉన్న ఆనంద వినాయకుని ఆలయంలో ఈ విగ్రహం ఉంది. సగంవినాయకుడు , సగంహనుమంతుడు కొలువై ఉన్నారు.  ఆదిలో వినాయకుడిని, ముగింపులో హనుమంతుడిని పూజిస్తారు. ఆద్యంతాలకు ప్రతీక అయిన ఈ స్వామిని ఆద్యంత ప్రభు అన్నారు. హనుమంతుడు, వినాయకుడు వేర్వేరైనా, తత్త్వం ఒక్కటే.
ఆలయ విశిష్టత  
కొన్ని సంవత్సరాల క్రితం తిరువేంకటస్వామి అనే ఓ పాఠశాల విద్యార్థి తన సహ విద్యార్థులతో కలసి ప్రస్తుతం మధ్యకైలాష్ ఆలయం వెలసిన చోట "చిన్న వినాయక విగ్రహాన్ని" ప్రతిష్టించాడు. ఇక బ్రహ్మచారులైన విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామివార్లు వారి అర్ధ శరీరాలతో ఏకమైనట్లు ఏర్పాటైన విగ్రహం భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది.  ఇద్దరు సింధూర ప్రియలు. ఒకవైపు ఆంజనేయస్వామి, మరోవైపు వినాయకుడు.  ఈ దేవాలయం సందర్శిస్తే సకల శుభాలు కలుగుతాయి.  శాస్త్ర విధానంలో నిర్మించిన ఈ దేవాలయం పరమ విశేషమైనది.  ఈ ఆద్యంత ప్రభును పూజిస్తే సకల శనిదోషాలు పోతాయని గణేశ పురాణంలో ఉంది. ఇక్కడి దేవాలయంలో అన్నదానం, పితృకర్మలు కూడా చేస్తుంటారు.  అంతే కాకుండా ఇక్కడ హనుమంతుడు పార్వతీ పరమేశ్వరులు, ఆదిత్యుడు, మహావిష్ణువు, దుర్గా, నవగ్రహాలు, స్వర్ణభైరవులు  కూడా కొలువై ఉన్నారు.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts