YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు: హైకోర్టు

ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు: హైకోర్టు

హైదరాబాద్ సెప్టెంబర్ 15 
డిగ్రీ పీజీ విద్యార్థులకు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదని.. ఆఫ్ లైన్ లోనే భౌతికంగా నిర్వహించాలని విద్యా కమిషనర్ ఈనెల 11న ఉత్తర్వులు జారీ చేశారు. అదే కమిషనర్ అటానమస్ కాలేజీలకు మాత్రం ఇష్టారీతిన పరీక్షలు నిర్వహించుకునే అవకాశం ఇస్తూ 12న ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇలా పరస్పర విరుద్ధంగా పొంతన లేకుండా ఆదేశాలు జారీ చేస్తే ఎలా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆన్ లైన్ లోనే పరీక్షలు నిర్వహించేలా ఆదేశించాలంటూ ఎన్ఎస్.యూ.ఐ వేసిన పిల్ ను హైకోర్టు విచారించింది.పరీక్షలు ఏ విధానంలో నిర్వహించాలనేది ప్రభుత్వ విధానరపరమైన నిర్ణయమని అందులో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.అయితే వర్సిటీలు వర్సిటీల గుర్తింపు ఉన్న కళాశాలల్లో 240356 మంది.. యూజీ 30922 మంది పీజీ విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉందని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ చెప్పారు. వీరు తప్పనిసరిగా పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని ఇప్పుడు రాయలేని వారికి తర్వాత స్పెషల్ సప్లిమెంటరీ నిర్వహిస్తామన్నారు. అందులో ఉత్తీర్ణత సాధించినా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తామని ప్రభుత్వం తరుఫున లాయర్ వివరించారు.అయితే ఏ విధానంలో పరీక్షలు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. వాటిని తమకు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Related Posts