YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ప్రైవేటు యూనివర్సిటీలు వద్దు

ప్రైవేటు యూనివర్సిటీలు వద్దు

మహబూబ్ నగర్ సెప్టెంబ‌ర్ 24, 
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల ను ప్రోత్సహిస్తూ 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించకుండా అలాగే విద్యను దూరం చేస్తుందంటూ అందుకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తోందని ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా నోరు మెదపడం లేదని ఆయన అన్నారు. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్, వ్యవసాయ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందని మరి కేసీఆర్ తీసుకువచ్చిన ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు విషం పూసిన కత్తి లాంటిదని ఆయన ఎద్దేవా చేశారు. కాబట్టి ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును కేసీఆర్ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే  అట్టడుగు వర్గాల స్థాయినుండి రాజకీయ తిరుగుబాటుకి కూడా సిద్ధంగా ఉంటామని ఆయన డిమాండ్ చేశారు. ఆ దిశగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను చైతన్యపరిచేందుకు ఈనెల 25 నుండి వచ్చేనెల 15 వరకు మహాజన సోషలిస్టు పార్టీ మరియు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కు  చైతన్యం కల్పిస్తూ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పాదయాత్రలు, దీక్షలు చేపడతామని అలాగే వచ్చే నెల 21న హైదరాబాదులోని లక్షలాది మంది విద్యార్థులతో మహా దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు. మరోవైపు వర్గీకరణ విషయంలో కేసీఆర్ వైఖరిని తెలపాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు...

Related Posts