YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

హైద్రాబాద్ కు ఆర్టీసీ స‌ర్వీసులు

హైద్రాబాద్ కు ఆర్టీసీ స‌ర్వీసులు

విజ‌య‌వాడ‌,అక్టోబ‌రు 10, 
తెలంగాణ-ఏపీల మధ్య ఆర్టీసీ పంచాయితీ కొలిక్కివచ్చే అవకాశం కనిపిస్తోంది. బస్సు సర్వీసులు ప్రారంభంపై కీలక ముందడుగు పడుతోంది. తెలంగాణ ఆర్టీసీ పట్టుబడుతున్నట్లుగా ఆ రాష్ట్ర పరిధిలో ఏపీఎస్‌ఆర్టీసీ నిత్యం 1.61 లక్షల కి.మీ. మేర మాత్రమే సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతోంది. 1.04 లక్షల కి.మీ. మేర సర్వీసులు తగ్గించుకోనుంది. ఇరు రాష్ట్రాలు అంతర్రాష్ట్ర ఒప్పందానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.మార్చిలో లాక్‌డౌన్‌ ముందు వరకు ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణ పరిధిలో రోజూ 2.65 లక్షల కి.మీ... తెలంగాణ ఆర్టీసీ ఏపీ పరిధిలో 1.61 లక్షల కి.మీ. మేర సర్వీసులు నడిపేవి. కానీ ఇప్పుడు బస్సు సర్వీసులు పునరుద్ధరించాలంటే అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోవాల్సిందేనని టీఎస్‌ఆర్టీసీ పట్టుబట్టింది. ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు 1.61 లక్షల కి.మీ. చొప్పునే నడపాలని షరతు విధించింది.. రెండు, మూడు సార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు 2.08 లక్షల కి.మీ. నడిపే ప్రతిపాదనతో వెళ్లారు.. కానీ తెలంగాణ అధికారులు మాత్రం అంగీకరించలేదు. చివరకు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు 1.61 లక్షల కి.మీ.కే ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు. ఏయే మార్గాల్లో ఎన్ని సర్వీసులు ఉంటాయనే జాబితా సిద్ధం చేస్తున్నారు. విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో తాము ఎక్కువ సర్వీసులు నడుపుతామని టీఎస్‌ఆర్టీసీ చెబుతుండగా.. ఏపీ కూడా సర్వీసులు ఎక్కువ ఉండాలని కోరనున్నారు. తాజా ప్రతిపాదనలతో ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు వచ్చే సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌ వెళ్లి తెలంగాణ ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది.

Related Posts