YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అరకు కాఫీకి అంతులేని డిమాండ్

అరకు కాఫీకి అంతులేని డిమాండ్

విశాఖపట్టణం, అక్టోబరు 12,
ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయ గిరిజన రైతులు పండించే కాఫీకి అంతర్జాతీయ అవార్డు లభించింది. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ప్రిక్స్‌ ఎపిక్యురెస్‌ ఓఆర్‌ 2018 అవార్డులో పసిడి బహుమతి గెలుచుకుంది. అరకు కాఫీని బ్రాండ్‌ను మహీంద్రా అండ్‌ మహ్రీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా డైరెక్టరుగా ఉన్న నాంది ఫౌండేషన్‌ ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తోంది. గతేడాదే ఈ కాఫీ పొడిని పారిస్‌లో అమ్మడం ప్రారంభించారు. అక్కడి ప్రసిద్ధ మాల్స్ లో, సొంత విక్రయ శాలలో కూడా అందుబాటులోకి తెచ్చారు. దీనితో అక్కడి వారిని నచ్చిన కొలంబో, సుమత్రా వంటి ప్రసిద్ధ కాఫీ గింజల సరసన అరకు కాఫీ ధీటుగా నిలిచింది. ప్రాన్స్ లోని పారిస్ లో ప్రిక్స్ ఎపిక్యూరెస్ ఓ.ఆర్ 2018 అవార్డులలో అరకు కాఫీ పసిడి బహుమతి గెలుచుకుంది. ఈ కాఫీ బ్రాండ్ ను మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా డైరెక్టర్ గా ఉన్న నాంది ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేస్తోంది. కేవలం గింజలే కాకుండా కాఫీ ఆకులతో సైతం అరకు రైతులు అదనపు ఆదాయాన్ని అర్జిస్తున్నారు. నేచురల్ ఫార్మసీ ఇండియా అనే సంస్థ ‘అరకు చాయ్’ పేరుతో కెఫిన్ తక్కువగా, కృత్రిమ రుచులకు దూరంగా ఉండేలా గ్రీన్ టీని తయారుచేస్తోంది.అరకు కాఫీని అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చిదిద్దాలన్న తొలి ఆలోచన రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ వ్యవస్థాపకుడు అంజిరెడ్డిది. ఆయన చొరవతోనే మిగతా దిగ్గజాలూ ఇటువైపు వచ్చారు. మహీంద్రా అండ్‌ మహీంద్రా అధినేత ఆనంద్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ సహ- వ్యవస్థాపకుడు క్రిష్‌ గోపాలకృష్ణన్‌, సోమా ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ మాగంటి రాజేంద్రప్రసాద్‌, రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌కు చెందిన సతీష్‌రెడ్డి... ఈ నలుగురూ అరకు కాఫీ వీరాభిమానులే. ఆ రుచీ పరిమళమూ ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితం కాకూడదని బలంగా విశ్వసించేవారే. ఆ అభిమానంతోనే అరకు గ్లోబల్‌ హోల్డింగ్స్‌కు శ్రీకారం చుట్టారు.

Related Posts

0 comments on "అరకు కాఫీకి అంతులేని డిమాండ్"

Leave A Comment