YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో స్కూళ్ల ప్రారంభానికి అంతా సిద్ధం

ఏపీలో స్కూళ్ల ప్రారంభానికి అంతా సిద్ధం

విజ‌య‌వాడ‌, అక్టోబ‌రు 21, 
సెల‌వు వ‌స్తే చాలు. ఎప్పుడు ఆట‌లాడుదామా అని చూస్తుంటారు పిల్ల‌లు. స్కూల్స్ ఓపెన్ అంటే.. వామ్మో అని బుంగ‌మూతి పెట్టుకుంటారు. అట్లాంటిది ఇప్పుడు రివ‌ర్స్ అయింది. స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చూస్తున్నారు. పాపం వాళ్లు వ‌ర‌కు ఎన్నాళ్లు ఉంటారు చెప్పండి. ఆట‌లు ఆడీ ఆడీ బోర్ కొట్టేస్తుందంట‌. మ‌మ్మీల కంటే టీచ‌ర్లే న‌యం.. ఇంట్లో ఉంటే త‌ట్టుకోలేక పోతున్నాం అనే కామెడీలు ఎన్ని చూళ్లేదు చెప్పండి. ఇక ఏపీ స్కూల్ పిల్ల‌ల‌కు ఈ క‌ష్టాలు త‌ప్పిన‌ట్లే ఉంది. న‌వంబ‌ర్ రెండో తారీఖు నుంచి స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. అప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యాలు ఏమైనా మార‌తాయో ఏమోగానీ.. ఇప్ప‌టికైతే డేట్ ఫిక్స్ చేశారు సీఎం జ‌గ‌న్. డేట్ ఫిక్స్ అన‌గానే.. భ‌య‌ప‌డాల్సిందేం లేకుండా కేర్ తీసుకుంటోంది ఏపీ స‌ర్కార్. అన్ని ఏర్పాట్ల పైనా ఓ క్లారిటీకి వ‌చ్చారు. కిడ్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి. దూరం దూరం ఎలా ఉంచాలి. పాటాలు ఎలా చెప్పాలి. హోం వ‌ర్క్ ఎలా ఇవ్వాలి అనే విష‌యాల‌పై ఫుల్లు క్లారిటీతో ఉన్నారు. రోజు విడిచి రోజు స్కూల్ ఉండాల‌ని.. అలాగే ఉద‌యం తొమ్మిది గంట‌ల నుంచి.. మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కూ మాత్ర‌మే స్కూల్స్ న‌డ‌వాల‌ని ఆదేశాలు జారీ చేశారు. దీనికి త‌గ్గ‌ట్లు ప‌క్కా ప్రణాళిక ప్రిపేర్ చేయాల‌ని అధికారుల‌కు ఆర్డ‌ర్స్ పాస్ చేసింది ఏపీ సర్కార్. స్కూల్ విద్యార్థులు 750 మందికి  పైగా ఉంటే.. మూడు రోజుల గ్యాప్ ఉండాల‌ని..750 మంది కంటే త‌క్కువ‌గా ఉంటే.. రెండు రోజుల గ్యాప్ త‌ర్వాత ఉండాల‌ని.. లేదంటే రోజు విడిచి రోజు ఉండేలా ప్లాన్ చేయాల‌న్నారు. ఒక వేళ పేరెంట్స్ కానీ స్కూల్ కి పంప‌డానికి ఓకే చెప్ప‌కుంటే ఆ ఇంటి పిల్ల‌ల‌కి ఆన్ లైన్ క్లాసులు చెప్పాల‌ని ఆర్డ‌ర్ చేశారు సీఎం జ‌గ‌న్.

Related Posts