YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

సింహపురి లో సివిల్ సర్వీసెస్ తో పాటు ఐఏఎస్ అకాడమీ 26 నుండి డెమో క్లాసులు ప్రారంభం

సింహపురి లో సివిల్ సర్వీసెస్ తో పాటు ఐఏఎస్ అకాడమీ  26 నుండి డెమో క్లాసులు ప్రారంభం

నెల్లూరు అక్టోబర్ 25
 నెల్లూరు నగరంలోని మినీ బైపాస్, అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న శ్రీధర్ కృష్ణ టవర్స్ లో శుక్రవారం  సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ అకాడమీ ని ప్రారంభించారు. అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ శ్రీకరణి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ మరియు ఐఏఎస్ చదువుకోవాలనే తలంపు ఉన్న సింహపురి విద్యార్థినీ విద్యార్థులకు  అందుబాటులోకి, తన మిత్రులు, తన తోటి సహచర విద్యార్థులు శ్రీ ఐర ఐఏఎస్ అకాడమీ ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్లు ఆర్ ప్రవీణ్ కుమార్ ,  జి ప్రణయ్ కుమార్ లను అభినందించారు. సివిల్ సర్వీస్ తో పాటు ఐఏఎస్ స్టడీ నందు ఉత్తమ శిక్షణ ఇవ్వగల శ్రావణ్ కుమార్ మరియు ప్రణయ్ కుమార్ ల సంయుక్త కలయికతో అకాడమీ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఐఏఎస్ చదవాలనే తపన కలిగిన సామాన్య విద్యార్థులకు ఈ అకాడమీ ఓ వరం కానుందన్నారు. ఈ నెల 26 నుండి డెమో క్లాసు లో  జరుగుతాయని తెలియజేశారు.

Related Posts