YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఏక్ నాథ్ ఖడ్సే పార్టీకి రాజీనామా

ఏక్ నాథ్ ఖడ్సే పార్టీకి రాజీనామా

ఏక్ నాథ్ ఖడ్సే పార్టీకి రాజీనామా
ముంబై, 
ఎక్కడైనా పదవులు రాకపోయినా… పార్టీ అధినాయకత్వం గుర్తించకపోయినా అసంతృప్తి సహజమే. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి నేతలు పార్టీకి రాజీనామా చేసి వెళ్లడం ఇటీవల కాలంలో అరుదుగా జరుగుతుంది. మహారాష్ట్రలో అధికారంలో లేకపోయినా ఏదో ఒక విధంగా బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే బీజేపీని కాదని ఆ పార్టీ సీనియర్ నేత బీజేపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.మహారాష్ట్రలో బీజేపీ సీనియర్ నేత ఏక్ నాథ్ ఖడ్సే పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఎన్సీపీలో చేరిపోయారు. అయితే ఆయన తన రాజీనామాకు కారణం మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రధాన కారణమని ఆరోపించారు. తన రాజకీయ జీవితాన్ని దేవేంద్ర ఫడ్నవిస్ నాశనం చేశారంటూ ఆయన శాపనార్ధాలు పెట్టారు. బీజేపీ నుంచి సీనియర్ నేత ఏకనాధ్ ఖడ్సే వైదొలగడం ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు.ఏక్ నాథ్ ఖడ్సేకు బీజేపీతో సంబంధం ఈనాటిది కాదు. దశాబ్దాల అనుబంధం ఉంది. గతంలో దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒక ల్యాండ్ సెటిల్ మెంట్ కేసులో ఏక్ నాథ్ ఖడ్సే పై ఆరోపణలు రావడం, దావూద్ ఇబ్రహీం నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయన్న వార్తలతో ఆయన రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడింది.గత ఎన్నికల్లో సయితం ఏక్ నాథ్ ఖడ్సేకు బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన కుమార్తెకు టిక్కెట్ ఇచ్చినా ఆమె గెలవలేకపోయారు. తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో తన పేరు ఖరారు చేస్తారని ఏక్ నాథ్ ఖడ్సే భావించారు. కానీ అప్పుడు కూడా ఆయన పేరును పరిశీలనలోకి కూడా తీసుకోలేదు. దీంతోనే ఏక్ నాథ్ ఖడ్సే తనకు బీజేపీలో భవిష్యత్ లేదని భావించి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజకీయ భవిష్యత్ ఎన్సీపీ లో మెరుగ్గా ఉంటుందని భావించి ఆ దిశగా ఆ నిర్ణయం తీసుకున్నారు.

Related Posts