YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

 రూ.50 కోట్ల ఖర్చుతో 80 కోట్ల చేప పిల్లల విడుదల

 రూ.50 కోట్ల ఖర్చుతో 80 కోట్ల చేప పిల్లల విడుదల

 రూ.50 కోట్ల ఖర్చుతో 80 కోట్ల చేప పిల్లల విడుదల
హైదరాబాద్ నవంబర్ 2
తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత మత్స్య రంగ అభివృద్దికి, ఈ రంగం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్  నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  వెల్లడించారు. మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం 50 కోట్ల రూపాయల ఖర్చుతో 80 కోట్ల చేప పిల్లలను రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో విడుదల చేయాలని నిర్ణయించి ఇప్పటికే 57 కోట్ల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని వివరించారు.2016-17 సంవత్సరంలో 3939 నీటి వనరులలో 27.85 లక్షల చేప పిల్లలు విడుదల చేయగా 1.93 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు. 2017-18 సంవత్సరంలో 11,067 నీటి వనరులలో 51 కోట్ల చేప పిల్లలు విడుదల చేయగా 2.62 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందని మంత్రి వివరించారు. 2018-19 సంవత్సరంలో 10,772 నీటి వనరులలో 49 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తే 2.84 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందన్నారు. 2019-20 సంవత్సరంలో 15,175 నీటి వనరులలో 64 కోట్ల చేప పిల్లలు విడుదల చేసి 2.99 లక్షల టన్నుల మత్స్య సంపద వృద్ది చేయడం జరిగిందని అన్నారు. ఈ సంవత్సరం విడుదల చేస్తున్న 80 కోట్ల చేప పిల్లల తో సుమారు 3.40 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
మత్స్యకారులకు అదనపు ఆదాయాన్ని కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మంచినీటి రొయ్యపిల్లలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయల ఖర్చుతో 5 కోట్ల రొయ్య పిల్లలను త్వరలో విడుదల చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద సుమారు 800 కోట్ల రూపాయల తో మత్స్యకారులకు సబ్సిడీ పై వాహనాలు, వలలు, ఇతర మౌలిక వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 2019-20 సంవత్సరంలో 3.10 చేపలు, రొయ్యల ఉత్పత్తి జరిగిందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ముషీరాబాద్, బేగంబజార్ ల లోని హోల్ సేల్ చేపల మార్కెట్ ల ద్వారా ప్రజలకు చేపలను విక్రయించడం జరుగుతుందని, ఇవే కాకుండా 1500 మంది రిటైల్ విక్రయదారుల ద్వారా చేపల విక్రయాలు జరుగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపలకు ఉన్న అత్యధిక డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని మరియు ప్రజల ఆరోగ్య సంరక్షణకు దోహదపడే ఆహారంగా చేపలకు ఉన్న అధిక ప్రాధాన్యతను గుర్తించి లక్షలాదిమంది ప్రజలకు నాణ్యమైన చేపలను, చేపల ద్వారా తయారు చేసే ఆహార పదార్ధాలను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్ కు ఒకటి చొప్పున 150 డివిజన్ లకు 150 మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లను త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఒక్కో యూనిట్ (వాహనం) విలువ 10 లక్షల రూపాయలు కాగా, ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 6 లక్షల రూపాయలు, లబ్దిదారుల వాటా 4 లక్షల రూపాయలుగా పథకం రూపకల్పన చేయడం జరిగిందని చెప్పారు. ఈ పధకము  హైద్రాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోగల 150 జీహెచ్ఎంసీ డివిజన్ లలో అమలు చేయబడు చున్నదని తెలిపారు. ప్రతి యూనిట్  3  నుండి  5 వేరు వేరు కుటుంబాలకు చెందిన మహిళా అభ్యర్థులు కలిసి ఏర్పడిన గ్రూపునకు యివ్వనున్నట్లు చెప్పారు. ఒక వార్డుకు ఒకరికన్నాఎక్కువ అర్హత గల దరఖాస్తు లు వస్తే జిల్లా ఎంపిక  మరియు ఆమోద కమిటీ (DSAC) వారిచే ఆధ్వరంలో దరఖాస్తు చేసుకున్న వారి సమక్షంలో లాటరి పద్దతిలో ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 10 వ తేదీ చివరి తేదీ అని తెలిపారు. 16 లేదా 17 తేదీ లలో లబ్దిదారుల ఎంపికకు లాటరీ నిర్వహించడం జరుగుతుందని, 17 వ తేదీన లబ్దిదారుల తుదిజాబితాను ప్రకటించనున్నట్లు మంత్రి చెప్పారు.

Related Posts