YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

మాంద్యంలోకి భారత ఆర్థిక వ్యవస్థ: ఆర్బీఐ

మాంద్యంలోకి భారత ఆర్థిక వ్యవస్థ: ఆర్బీఐ

న్యూ ఢిల్లీ  నవంబర్ 12  
కరోనా దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా వెళ్తుందని రిజర్వ్ బ్యాంక్ సైతం తన నివేదికలో వెల్లడించింది.  దేశ చరిత్రలో తొలిసారి.. భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించినట్లు ఆర్బీఐ అంచనా వేసింది.  టెక్నికల్ గా భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తెలిపింది. నౌక్యాస్ట్ పేరుతో ఆర్ బీఐ తొలిసారి నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో సెప్టెంబర్ త్రైమాసికంలో మన దేశ జీడీపీ 8.6 శాతం క్షీణించినట్లు తెలిపారు.   2020-21వ వార్షక సంవత్సరంలో.. తొలి అర్థభాగంలో దేశం సాంకేతికంగా మాంద్యంలో ప్రవేశించినట్లు ఆర్బీఐ పేర్కొన్నది. ఈ ఏడాది  తొలి త్రైమాసికంలోనూ జీడీపీ అధికంగా 24 శాతం క్షీణించింది. ఎప్పుడైనా రెండు త్రైమార్షికాల్లో వరుసగా ఇలా ఆర్థిక వ్యవస్థలో క్షీణత నమోదైతే సాంకేతికంగా మాంద్యంలోకి వెళ్లినట్లుగా ఆర్థికవేత్తలు అంచనా వేస్తారు. అయితే అక్టోబర్-డిసెంబర్ మూడో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతుందని నివేదిక అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే ఆర్థిక మాంద్యానికి సంబంధించిన వివరాలు లెక్కలను నవంబర్ 27న ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది. కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో అక్టోబర్ లో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైందని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడ్డాయని కానీ అక్టోబర్ లో భారత ఆర్థిక వ్యవస్థ కొంత ఆశాజనక ప్రదర్శన ఇచ్చిందని వ్యాపారవేత్తల్లో నమ్మకాన్ని నిలిపినట్లు ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది. అయినా  ఈ విపత్తు నుంచి బయటపడేందుకు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.

Related Posts