YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దుబాయిలో చంద్రబాబు నల్లధన కేంద్రం..?

దుబాయిలో చంద్రబాబు నల్లధన కేంద్రం..?

చంద్రబాబు లాంటి ఆర్ధిక ఉగ్రవాది ప్రపంచంలోనే లేడు . న్యాయస్థానాలకే కాదు ఆఖరికి దేవుడికి కూడా దొరకకుండా కుంభకోణం చేయటంలో సిద్ధహస్తుడు . ఎలాంటి సంక్షోభాన్ని అయినా తనకి అనుకూలంగా మార్చుకొని వేల కోట్లు కొల్లగొట్ట గల అపరమేధావి .
ఉమ్మడి రాష్ట్రాన్ని దగ్గర ఉండి విడగొట్టటం దగ్గరనుండి అమరావతిని రాజధానిగా ఎంపిక చేయటం వరకూ ప్రతిదీ తన దోపిడీకి అనుకూలంగా చూసుకొని పక్కా ప్లాన్ తో పావులు కదిపాడు . మీకు గుర్తుందా ' రాజధాని బిల్లు నెగ్గగానే మేమె మొదటి ఓటు వేసాం అని టీడీపీ ఎంపీలు పార్లమెంట్ బయటకొచ్చి సంబరాలు చేసుకొన్నారు , అదే సమయంలో హైద్రాబాద్లో చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి కొత్త రాజధానికి 5 లక్షలు కోట్లు అవసరమవుతాయని ఆమేరకు కేంద్రం ఇవ్వాలని లెక్కలు కట్టి మరీ చెప్పాడు .
ఆనాడు చంద్రబాబు చెప్పిన 5 లక్షలు కోట్లలో కేంద్రం ఎంత ఇచ్చిందో , రాజధాని పేరుతొ చంద్రబాబు ఎంత అప్పు చేస్తున్నాడో ఆ దేవుడికే తెలియాలి . ఇకపోతే ఈ రాజధానిని అడ్డం పెట్టి విదేశాలలో తనకున్న నల్లధనాన్ని అనేక మార్గాల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రూపంలో తెచ్చి తెల్లధనంగా మారుస్తున్నాడు .
ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకి సహకరిస్తుంది ఎవరు ? ఇన్నివేల కోట్ల నల్లధనాన్ని అంత్యంత చాకచక్యంగా దేశంలోకి తెస్తుంది ఎవరు ? పూర్తిగా చదవండి .
చంద్రబాబు నల్లధనం వ్యవహారాలన్నీ దుబాయి కేంద్రంగా సాగుతున్నాయి . దీనిలో బాబుకి సహకరిస్తుంది బి ఆర్ శెట్టి అనే వ్యాపారవేత్త . ఇతను దుబాయి లో ఏమి చేస్తుంటాడు ?
బి ఆర్ శెట్టి అనే అతను దుబాయిలో ఉన్న భారతీయులలో అత్యంత ధనవంతుడు . ఇతను ప్రధాన వ్యాపారం' మనీ ఎక్స్చేంజి ' . ఇతను UAE Money Exchange కి అధిపతి . దీనిద్వారా మనీ లాండరింగ్ చేస్తారు . ఇతనికి 31 దేశాలలో 800 ఆఫీసులు ఉన్నాయి . మనీ లాండరింగ్ అంటే ' ఒకదేశం నుండి మరొక దేశానికి మనీ తరలించటం ' . ఉదాహరణకి ఎవరైనా అమెరికా నుండి ఇండియాకి డబ్బు పంపాలంటే ఇలాంటి మనీ ఎక్స్చేంజి ధ్వారానే పంపాలి . ఉదాహరణకి ఇక్కడ xoom అని ఉంటుంది , దానిలో మనం డాలర్లు ఇస్తే , వాళ్ళు ఇండియాలో మనం ఇచ్చిన అకౌంట్ కి రూపాయలలో వేస్తారు . దానికి వాళ్ళు కమిషన్ తీసుకొంటారు . స్థూలంగా ఇది బి ఆర్ శెట్టి చేసే వ్యాపారం . ఈ వ్యాపారంలో కొన్ని లక్షల కోట్లు చేతులు మారతాయి , విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తెలుపుగా మార్చుకోవటానికి కూడా దీనిని వాడుతున్నారు . ఇప్పుడు చంద్రబాబు కూడా చాలా పకడ్భందిగా బి ఆర్ శెట్టి ద్వారా వేలకోట్ల నల్లధనాన్ని తెల్ల ధనంగా మారుస్తున్నాడు .
బి ఆర్ శెట్టి పేరుతొ రంగప్రవేశం -
అమరావతిలో పెట్టుబడులు పేరుతొ విదేశాల చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు నిజానికి విదేశాల నుండి తెచ్చింది సూన్యం . కాకపోతే తన సొంత డబ్బునే విదేశాలలో తన బినామీలకు ఇచ్చి వాళ్ళతో ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తున్నట్లు నాటకం ఆడుతూ వాళ్ళ ద్వారా తన నల్లడబ్బునే ఇక్కడకి తెస్తున్నాడు , అంతేకాదు పెట్టుబడులు పెడుతున్నారనే సాకుతో వేల ఎకరాలు అమరావతిలో విదేశాల నుండి వచ్చే తన బినామీలకు కట్టబెడుతున్నాడు ..
దానిలో భాగమే బి ఆర్ శెట్టి కి 100 ఎకరాలు కట్టబెట్టి , 12000 (12 వేలు ) కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు నాటకమాడుతూ చంద్రబాబు సొంతడబ్బునే బి ఆర్ శెట్టి పేరుతొ ఇక్కడకి తరలించాడు .
చంద్రబాబు ఏమీ చేసినా చాలా పకడ్భందిగా ఎవరికీ దొరకకుండా చేస్తాడు ..

G.O.MS.No : 330 Date :- 13-12-2016 
బి ఆర్ శెట్టి హాస్పిటల్ కోసం 100 ఎకరాలు కేటాయిస్తూ జారీ చేసిన జీవో . దీనిలో మీరే చూడండి , ఎకరం కేవలం 50 లక్షలకి కట్టబెట్టాడు . మొత్తం 50 కోట్లకి 100 ఎకరాలు కట్టబెట్టాడు . ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఎకరం 5 కోట్లు ఉంది . కనీసం 500 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 50 కోట్లకి కట్టబెట్టాడు . ఈ జీవిలోనే ఇంకా వివరాలు చూడండి . 
...2018 లో హాస్పిటల్ నిర్మాణం పూర్తి 
...2018 లో త్రీ స్టార్ హోటల్ నిర్మాణం పూర్తి 
...2019 లో మెడికల్ యూనివర్సిటీ
ఇవి కొన్ని మాత్రమే , మిగతావి జీవోలో మీరే చూడండి . ఇప్పుడు 2018 వచ్చింది ( ఆ జీవో ఇచ్చింది 2016 లో ) , మరి జీవోలో పేర్కొన్నట్లు హాస్పిటల్ రెడీ అయిందా ? కనీసం పునాది అయినా తీసారా ? దేవుడికే తెలియాలి .
హాస్పిటల్ శంకుస్థాపన చేస్తూ మొత్తం 12 వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటన ( 1.8 బిలియన్లు ) . ఇది అంతా చంద్రబాబు డబ్బే , కాకపోతే బి ఆర్ శెట్టి పేరుతొ చంద్రబాబు నడుపుతున్న నాటకం .
చంద్రబాబు ఈ మూడేళ్ళలో ఎన్నో సార్లు పెట్టుబడులు పేరుతొ విదేశాలలకి వెళ్ళాడు , ఏ దేశం వెళ్లినా ప్రతిసారీ చంద్రబాబు కలుసుకొనేది బి ఆర్ శెట్టినే . ఇతను చంద్రబాబు ఏ దేశం వెళ్తే ఆదేశంలో ప్రత్యక్షం అవుతాడు .. అంతేకాదు చంద్రబాబు సంవత్సరానికి రెండుసార్లు వ్యక్తిగత పర్యటన పేరుతొ దుబాయి , సింగపూర్ , మలేసియా వెళ్తాడు . ఆ వివరాలన్నీ పూర్తి గోప్యంగా ఉంచుతారు , కనీసం ఏ దేశానికి వెళ్ళాడో కూడా ఎవరికీ చెప్పరు .
చంద్రబాబు గత నవంబర్లో రెండు రోజులు కేరళ వెళ్ళాడు , ఎందుకు వెళ్ళాడో తెలుసా ? 
దుబాయి కేంద్రంగా వ్యాపారాలు చేసే యూసఫ్ అలీ , బి ఆర్ శెట్టి లు ఇద్దరు కొచ్చి ( కేరళ రాజధాని ) లులు పేరుతొ పెద్ద పెద్ద మాల్స్ కట్టారు , ఇంకా కొచ్చి కన్వెన్షన్ సెంటర్ కూడా కట్టారు . వాటిని పరిశీలించటానికి దగ్గరుండి వాటి నిర్వహణ వ్యవహారాలు చూడటానికి చంద్రబాబు కేరళ వెళ్ళాడు . అలాంటి మాల్స్ నే విశాఖపట్టణంలో కూడా ప్లాన్ చేస్తున్నారు . కొచ్చిలో కట్టిన మాల్స్ అంతా చంద్రబాబు పెట్టుబడేనని అక్కడ అందరూ గుసగుసలాడుకొంటున్నారు . తన నల్లధనాన్ని దుబాయి వ్యాపారస్తుల ద్వారా ఇక్కడకి తరలించి పెట్టుబడులు పెట్టిస్తున్నాడు .
-
సరిగ్గా మూడునెలలు క్రితం దుబాయి లో సైమా సినిమా అవార్డుల ఫంక్షన్ జరిగింది . ఈసారి ఈ ఫంక్షనలో చాలా చిత్రాలు జరిగాయి . సినిమాలకి ఏ మాత్రం సంభంధం లేని నారా బ్రాహ్మణి చీఫ్ గెస్ట్ , ఆమెతోపాటు చంద్రబాబు నల్లధనాన్ని దేశవిదేశాలు తరలిస్తున్న బి ఆర్ శెట్టి మరో చీఫ్ గెస్ట్ . చంద్రబాబు మరో బినామీ కేరళలో బాబు డబ్బుని పెట్టుబడిగా పెట్టిన యూసఫ్ అలీ మరో విశిష్ట అతిధి .
అసలు సినిమాలకి ఏ మాత్రం సంబంధంలేని ముగ్గురు వ్యక్తులు దుబాయిలో కలుసుకోవటం , అందులో ముగ్గురు చంద్రబాబు మనుషులు కావటం ఇంకా అనుమానాలకు తావిస్తుంది . ఈ ఫంక్షన్ కార్యక్రమంలో అందరినీ ఆహ్వానించి దగ్గరుండి మర్యాదలు చేసింది రాజమండ్రి ఎంపీ చంద్రబాబు మరో బినామీ మురళీమోహన్ .
ఈ విధంగా చంద్రబాబు రాజధానిలో విదేశీ పెట్టుబడులు పేరుతొ దోచుకొని దేశం దాటించిన తన సొంత డబ్బునే తన బినామీల ద్వారా తెల్ల ధనంగా మార్చి తెస్తున్నాడు , దానిని అడ్డంపెట్టి మళ్ళీ రాజధానిలో వేల ఎకరాలని తన బినామీలకే కట్టబెడుతున్నాడు ..
విదేశాల నుండి పెట్టుబడులు వస్తున్నట్లు అందరినీ నమ్మించి ముందు తెల్లధనంగా మారుస్తారు , అంతేకాకుండా దానిపేరుతో భూములు కొట్టేస్తారు ..
అక్కడ వాళ్ళు కొత్తగా కట్టేది కూడా ఏమీ ఉండదు . మార్చుకున్న తెల్లదనం ఆఖరికి అటుతిరిగి చంద్రబాబు హెరిటేజ్ లాభాల కింద జమ చేస్తారు ..
ఒక్కసారి నారా బ్రాహ్మణి ఇంటర్వ్యూ చూడండి . కేవలం మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా 50 కోట్లున్న హెరిటేజ్ ఆస్తి ఈనాటికి 14 వేల కోట్లకి చేరుకుంది . రాబోయే 5 సంవత్సరాలలో దానిని 50 వేల కోట్లకి చేరుస్తామని ధీమాగా చెప్తుంది . 50 కోట్ల నుండి 50 వేల కోట్లకి కంపెనీ చేరుకొంది అంటే ఎక్కడి నుండి అంత డబ్బు వచ్చినట్లు .
---1999 నుండి 2004 వరకూ కూడా ఇదే దుబాయి కేంద్రంగా హాసన్ ఆలీ ద్వారా వేల కోట్లు తరలించాడు . తెహెల్కా టేపులలో చంద్రబాబు పురాణం అప్పుడే వెలుగులోకి వచ్చింది , ఆ తరువాత హసన్ అలీ చనిపోయే ముందు సిబిఐ కి కూడా వాగ్మూలం చెప్పాడు . అయినా మన సిబిఐ లు , కోర్టులు చంద్రబాబుని ఏమీ పీకలేవు .


కొసమెరుపు :- రాష్ట్ర అప్పు ఈ మూడేళ్ళలో 90 వేల కోట్ల నుండి 2 లక్షల 20 వేల కోట్లకి చేరుకొంది . అలానే హెరిటేజ్ ఆస్తికూడా 50 కోట్ల నుండి 50 వేల కోట్లకి చేరుకొంది , మిగతా మొత్తం కూడా తన బినామీల పేరుతొ ఎక్కడో ఒకచోట పెట్టుబడులు పెట్టించే ఉంటాడు మన చంద్రబాబు .

Related Posts