YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

క్రెడిట్ కార్డు వినియోగదారులకు మారటోరియం ఎందుకు! కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

క్రెడిట్ కార్డు వినియోగదారులకు మారటోరియం ఎందుకు! కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ నవంబర్ 21 
క్రెడిట్ కార్డు వినియోగదారులకు అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. క్రెడిట్ కార్డు వినియోగదారులు ఉత్పత్తులను కొనుగోలు చేశారని, వారికి లోన్ మారటోరియం ప్రయోజనాలు ఎందుకంటూ... సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. లోన్ మారటోరియం, ప్రయోజనాలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు  ప్రశ్నించింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు, వ్యాపారులకు, సామాన్యులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించింది. మార్చి నుంచి ఆగస్ట్ వరకు మారటోరియం కాలానికి సంబంధించి బ్యాంకు రుణగ్రహీతల చక్రవడ్డీని భరించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా క్రెడిట్ కార్డు వినియోగదారులకు సుప్రీం షాకిచ్చింది.క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎందుకు లోన్ మాటోరియంకు సంబంధించి చక్రవడ్డీ మాఫీ ప్రయోజనం క్రెడిట్ కార్డు ఉపయోగించే వారికి అవసరం లేదని అభిప్రాయపడింది. క్రెడిట్ కార్డు వినియోగదారులు రుణగ్రహీతల కిందకు రారని పేర్కొంది. వారు రుణాలు పొందలేదని, కొనుగోళ్లు చేశారన తెలిపింది. పర్సనల్ లోన్ మొదలు క్రెడిట్ కార్డు వినియోగదారుల వరకు ఈ లోన్ మారటోరియం వర్తిస్తుందని ఆర్బీఐ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈ నిర్ణయాన్ని పలువురు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.చక్రవడ్డీ మాఫీకి కేంద్రం సుముఖంగా ఉంది. అయితే ఆర్బీఐ అంగీకరించడం లేదు. చక్రవడ్డీని మాఫీ చేస్తే ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్బీఐ తెలిపింది. తాను క్రెడిట్ కార్డు వినియోగదారుడిని అని, తనకు ఇటీవల చక్రవడ్డీ మాఫీ ఎక్స్‌గ్రేషియాకు సంబంధించి సందేశం వచ్చిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు 'క్రెడిట్ కార్డు వినియోగదారులు కొనుగోళ్లు జరుపుతున్నారు. వారు రుణాలు తీసుకోలేదు. వారికి ప్రయోజనం అవసరం లేదు' అని తెలిపింది
 

Related Posts