YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యడ్డీకి చివరి రోజులేనా

యడ్డీకి చివరి రోజులేనా

బెంగళూర్, డిసెంబర్ 29, 
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు రాజకీయంగా చివరి రోజులు నడుస్తున్నట్లే కన్పిస్తుంది. ఆయనను వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బాధ్యతల నుంచి పూర్తిగా పక్కకు తప్పిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా యడ్యూరప్పను తప్పిస్తారని వదంతులు విన్పిస్తున్నప్పటికీ, ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాకపోవచ్చని చెబుతున్నారు. అయితే ఈ టర్మ్ రాజకీయంగా యడ్యూరప్పకు లాస్ట్ అన్న వ్యాఖ్యలయితే బలంగా విన్పిస్తున్నాయి.యడ్యూరప్ప వయసు ఏడు పదులు దాటి పోవడం, పార్టీలో అసంతృప్తి ఎక్కువ కావడంతో కేంద్ర నాయకత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే యడ్యూరప్పకు తెలియకుండానే పార్టీలో అన్ని జరిగిపోతున్నాయంటున్నారు. మంత్రివర్గ విస్తరణ దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుల ఎంపిక వరకూ ఏదీ యడ్యూరప్ప అనుకున్నట్లు జరగలేదు. పైగా ఆయన కుమారుడి ఎఫెక్ట్ కూడా కొంత ప్రభావం చూపిందంటున్నారు.తాజాగా కర్ణాటకకు భూపేంద్ర యాదవ్ రావడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. భూపేంద్ర యాదవ్ కు మంచి వ్యూహకర్తగా పేరుంది. మోదీ,అ మిత్ షాలకు బాగా దగ్గర. భూపేంద్ర యాదవ్ కర్ణాటక పర్యటన సయితం యడ్యూరప్పకు తెలియకుండానే జరిగింది. ఆయన నేరుగా పార్టీ నేతలతో సమావేశం కావడం యడ్యూరప్పకు రాజకీయంగా చివరి ఘడియలేనన్న సిగ్నల్స్ బాగా వచ్చాయి.కేంద్ర నాయకత్వం కూడా యడ్యూరప్ప పనితీరు పట్ల సంతృప్తికరంగా లేదు. కర్ణాటకలో కొత్త నాయకత్వానికి బాధ్యతలను అప్పగించాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయిందంటున్నారు. యడ్యూరప్ప మరో రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటారు. అయితే మధ్యలోనే యడ్యూరప్పను దించేస్తారా? లేదా ఎన్నికల నాటికి నాయకత్వాన్ని మారుస్తారా? అన్నది ఇంకా డిసైడ్ కాకపోయినా మొత్తం మీద యడ్యూరప్పకు రాజకీయంగా చివరి ఘడియలేనన్న టాక్ కన్నడ నాట బలంగా విన్పిస్తుంది.

Related Posts